ఫ్యాక్ట్ చెక్: హిందూ మతానికి చెందిన వ్యక్తి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాపులారిటీ దక్కించుకోడానికి, కంటెంట్‌ను సృష్టించడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ

Claim :
కెనడాలో ఆస్ట్రియన్ శ్వేతజాతి అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఒక హిందూ వ్యక్తి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుందిFact :
వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి హిందువు కాదు, కొందరు తప్పుడు వాదనలతో వీడియోను షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాపులారిటీ దక్కించుకోడానికి, కంటెంట్‌ను సృష్టించడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. కంటెంట్ అంటూ చేసే పనులు కొన్నిసార్లు తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. కొందరికి చిరాకు కూడా కలుగుతుంది. ఇక ఈ ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యూవర్ షిప్ కోసం వికృత చేష్టలు చేస్తుంటారు. కొందరు నవ్వు తెప్పించే కంటెంట్‌ను సృష్టించే ప్రయత్నంలో, తరచుగా తమ చుట్టూ ఉన్న ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. భారతదేశంలో కూడా ప్రాంక్ వీడియోల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. కొందరు చేసే పనుల కారణంగా ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. 2024 సంవత్సరంలో, హైదరాబాద్‌లోని మాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించినందుకు హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్పై కేసు నమోదు చేశారు. ఇక రద్దీగా ఉండే ఢిల్లీ ఫ్లైఓవర్ మధ్యలో మరొక ఇన్ఫ్లుయెన్సర్ తన కారును ఆపి ఇన్స్టాగ్రామ్ రీల్‌ను క్రియేట్ చేసి ఇబ్బందులపాలైంది.