ఫ్యాక్ట్ చెక్: కైలాస పర్వతం చుట్టూ మేఘాలు తిరుగుతున్నట్లు కనపడుతున్న వీడియో ఏఐ సృష్టి
కైలాస పర్వతం.. సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం. పరమ శివుడు ఈ పర్వతంపై నివాసం
Claim :
కైలాస పర్వతంపైన మేఘాలు ఇలా అద్భుతంగా ఏర్పడ్డాయిFact :
వైరల్ వీడియో నిజం కాదు. AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించారు
కైలాస పర్వతం.. సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం. పరమ శివుడు ఈ పర్వతంపై నివాసం ఉంటారని ఎన్నో పురాణాల్లో ప్రస్తావన ఉంది. కైలాస పర్వతం హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధులు, బోన్లు, జైనులు మరియు సిక్కులు కూడా దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. కైలాస పర్వతం హిమాలయ పర్వతాలలో టిబెట్ నైరుతి మూలలో ఉన్న శిఖరం. 6638 మీ (21778 అడుగులు) ఎత్తులో ఉన్న ఇది హిమాలయాలలోని ఎత్తైన భాగాలలో ఒకటి. ఆసియాలోని కొన్ని నదులు కైలాస పర్వతం నుండే మొదలవుతాయి. సింధు, సట్లేజ్, బ్రహ్మపుత్రా, కర్నాలి నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయని చెబుతారు. చాలా మంది అధిరోహకులు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు.. కానీ వారు విఫలమయ్యారు.
పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉత్తరాఖండ్ "భారతదేశం నుండి కైలాస దర్శనం" అనే తీర్థయాత్రను ప్రవేశపెట్టింది. ఈ తీర్థయాత్ర భక్తులకు టిబెట్ లోకి వెళ్లకుండా, పితోర్‌ఘర్ జిల్లాలోని ఓల్డ్ లిపులేఖ్ శిఖరం వద్ద భారత భూభాగం నుండి కైలాస పర్వతాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ తీర్థయాత్ర భారతదేశ సరిహద్దులలో ఉంటూ ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా రూపొందించారు. మొదటి యాత్రికుల బృందం అక్టోబర్ 2, 2024న ఈ యాత్రను ప్రారంభించింది, అక్టోబర్ 3న కైలాస పర్వతాన్ని విజయవంతంగా వీక్షించారు. ఈ యాత్రలో ఆది కైలాష్, ఓం పర్వతం వంటి ఇతర పవిత్ర స్థలాల సందర్శనలు కూడా ఉన్నాయి.
మేఘాలతో కప్పబడి ఉన్న భారీ పర్వతాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కైలాస పర్వతాన్ని చూపుతుందనే వాదనతో వైరల్ అవుతోంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ముఖ్యంగా X వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. “ కైలాస శిఖరాన్ని ఎవరూ అధిరోహించలేరు. కానీ ప్రతి ఒక్కరి ఆత్మ చేరుకోవాలని ఆకాంక్షిస్తుంది." అంటూ పోస్టులు పెట్టారు.
“#कैलाश_पर्वत वो शिखर जिस पर कोई नहीं चढ़ सका लेकिन जहां पहुंचने की आकांक्षा हम सबकी आत्मा रखती है हर हर महादेव” అంటూ హిందీలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో ను షేర్ చేసారు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను AI ద్వారా రూపొందించారు.
లెంటిక్యులర్ మేఘాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకుందాం, లెంటిక్యులర్ మేఘాలు పర్వతాలు లేదా ఎత్తైన కొండలపై ఏర్పడే అరుదైన మేఘం. అవి స్థిరంగా ఉంటాయి. UFOలను పోలి ఉంటాయి.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను ఉపయోగించి శోధించినప్పుడు, కైలాష్ ఎనర్జీ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూన్ 28, 2024న “పవిత్ర పర్వతాలకు రాజు అయిన కైలాస పర్వతాన్ని చూసేవారికి కోరికలు కలుగుతాయి. ఈ పర్వత అద్భుత మహిమ నూ, ప్రశాంతతను అనుభూతి పొందాలి. ఈ మహిమ ఆత్మ ను శుద్ధి చేస్తుంది#puretibetan #kailashenergy #spiritual #soulawakening #pray #prayer #pure #tibet #healing #peace #energy #bless #faith #godness #shiva #kailash #mountkailash #blessings #offering” అనే క్యాప్షన్‌తో అప్లోడ్ చేసిన వీడియో లభించింది.
ఈ వీడియో ఆఈ ద్వారా రూపొందించారని ఈ పోస్ట్‌పై ఉన్న కామెంట్ల ద్వారా తెలుస్తోంది. ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ నిర్వాహకులను సంప్రదించి, వీడియో ఏఐ ద్వారా రూపొందించబడిందా అని అడిగాము. వారి సమాధానం ఇంకా రావాల్సి ఉంది. అయితే, కైలాష్ చుట్టూ లెంటిక్యులర్ మేఘాలు ఉన్న చిత్రాలు లేదా వీడియోల కోసం మేము మరింత శోధించినప్పుడు, మేము Flickrలో పోస్ట్ చేసిన చిత్రాన్ని కనుగొన్నాము.
మిస్ ఇంఫర్మేషన్ కాంబాట్ అలయన్స్ (MCA) వారి విభాగం అయిన 'డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్'సమన్వయంతో, మేము చిత్రాన్ని విశ్లేషించినప్పుడు, అది ఏఐ ను వాడి రూపొందించారనితెలుసుకున్నాం. డిఏయు విశ్లేషణ ప్రకారం, మానవ ముఖాలు లేని ఫైల్‌లను విశ్లేషించడం ఒక కఠినమైన ప్రక్రియ, ఎందుకంటే చాలా వీడియో డిటెక్టర్లు ఏఐ తో తయారైన మనుష్యుల చిత్రాలను,వీడియోలనూ గుర్తించడానికి శిక్షణ పొందాయి. అయితే, సర్క్యులేషన్లో ఉన్న మీడియా ఫైల్ మానవ ముఖాలు లేని జిఐఎఫ్. కాబట్టి హైవ్ ఏఐ అనే సధనం వారి ఇమేజ్ క్లాసిఫైయర్మ లో ఆకృతుల రంగును కుడి వైపున ఉన్న ఇండెక్స్‌తో పోల్చి చూడగా, ఇది "ఏఐ జెనెరేటెద్" అని తెలుస్తోంది.
విశ్లేషణ ఇక్కడ చూడొచ్చు.
తదుపరి పరిశోధనలో మేము ఇండియా టుడే ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ ను కూడా కనుగొన్నాము, అక్కడ వారు ఇన్స్టాగ్రామ్ పేజీ నిర్వాహకులను సంప్రదించినప్పుడు, వీడియో AIని ఉపయోగించి సృష్టించారని వారు ధృవీకరించారు. కైలాష్ పర్వతం ఫోటోను చిత్రీకరించారు. మిడ్‌జర్నీ టూల్ ని ఉపయోగించి దానిని సృష్టించారు.
కాబట్టి, వైరల్ వీడియో నిజమైనది కాదు. AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.