Fri Nov 22 2024 15:08:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వెలుగులు విరజిమ్ముతున్న అయోధ్య శ్రీరామ మందిరం పోలినది.. దుర్గా పూజ సమయంలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్
అయోధ్య రామమందిరాన్ని జనవరి 24, 2024న ప్రారంభించనున్నారు. మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం ఈ మందిరాన్ని 2.7 ఎకరాలలో నిర్మిస్తూ ఉన్నారు. ప్రధాన ఆలయ నిర్మాణం 161 అడుగుల పొడవు, మూడు అంతస్తులు, ఐదు మండపాలు కలిగి ఉంటుంది.
Claim :
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో విద్యుత్తు పనులు పూర్తయ్యాయి. అయోధ్య శ్రీరామ మందిరాన్ని భారీ సంఖ్యలో ప్రజలు చూస్తున్నట్లు వీడియోలో ఉంది.Fact :
ఈ వీడియో కోల్కతాలోని దుర్గా పూజా పండల్ కు సంబంధించింది. అక్టోబర్ 2023లో దుర్గా నవరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసింది.
అయోధ్య రామమందిరాన్ని జనవరి 24, 2024న ప్రారంభించనున్నారు. మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం ఈ మందిరాన్ని 2.7 ఎకరాలలో నిర్మిస్తూ ఉన్నారు. ప్రధాన ఆలయ నిర్మాణం 161 అడుగుల పొడవు, మూడు అంతస్తులు, ఐదు మండపాలు కలిగి ఉంటుంది. జనవరి 22న రామాలయ గర్భగుడిలో రామ్లల్లాను ప్రతిష్టించనున్నారు. ఈ అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అయోధ్య నగరానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయోధ్య రామమందిరంలో విద్యుత్ పనులు కూడా పూర్తయ్యాయన్న వాదనతో పోస్టులు పెడుతున్నారు. వెలుగులతో నిండి ఉన్న ఆలయం దగ్గర భారీ గుంపు నిలబడి ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
“श्रीराम मंदिर अयोध्या में विद्युत कार्य परीपूर्ण अलौकिक जगमगाहट...*जय श्री राम..!!!* “అంటూ హిందీలో పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది అయోధ్యలోని శ్రీరామ మందిరానికి సంబంధించినది కాదు. కోల్కతాలోని అయోధ్య రామమందిరానికి ప్రతిరూపంగా నిర్మించిన దుర్గాపూజ పందిరి మాత్రమే.మేము వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. దుర్గా పూజ పండుగ సందర్భంగా కోల్కతాలోని దుర్గా పూజ పండల్ అని ధృవీకరించే కొన్ని సోషల్ మీడియా పోస్ట్లను కూడా మేము కనుగొన్నాము.
అనంత్ అఫీషియల్ అనే ఛానెల్ ప్రచురించిన యూట్యూబ్ వీడియోను మేము కనుగొన్నాం. అయోధ్యలోని రామమందిరానికి ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన దుర్గాపూజ పండల్ వద్ద భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారని అందులో తెలిపారు. ఈ వీడియో అక్టోబర్ 23, 2023న అప్లోడ్ చేశారు. పండల్ను సంతోష్ మిత్ర స్క్వేర్ పూజా కమిటీ ఏర్పాటు చేసిందని వీడియో వివరణ తెలిపింది.
దీన్ని క్యూగా తీసుకుని “Ayodhya Ram Mandir Durga Puja Pandal Santosh Mitra Square” అంటూ సెర్చ్ చేశాం. పండల్ ను పోలిన చిత్రాల లాగే అనేక ఫోటోలకు సంబంధించి అక్టోబర్ 2023లో ప్రచురించిన పలు కథనాలను మేము కనుగొన్నాము.
wire.in ప్రకారం.. సంతోష్ మిత్రా స్క్వేర్ సర్బోజనిన్ దుర్గోత్సబ్ కమిటీ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం కోల్కతాలో గొప్పగా మండపం ఏర్పాటు చేస్తారని చెబుతూ ఉంటారు. అయోధ్య లాంటి మండపం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఈ విధంగా ఏర్పాటు చేశారని వివరించారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున జరిగే ఆచారాలను నిర్వహించడమే కాకుండా, రాముడు, హనుమంతుడుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా దక్కాయి.
Kolkatatales.in లో వచ్చిన కథనం ప్రకారం.. సంతోష్ మిత్రా స్క్వేర్, సాధారణంగా లెబుటలా పార్క్ అని పిలుస్తారు. ఇది కోల్ కతా నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటిగా ఉంది. 2023లో అయోధ్య రామమందిరాన్ని దుర్గా పండల్ల థీమ్గా నిర్ణయించడంతో, పండల్ ను చాలా గొప్పగా.. అలంకరించారు. ఈ పండల్ అయోధ్య రామమందిరం పోలి ఉంటుంది.
ఈ లింక్ లో పండల్ కు సంబంధించిన అనేక చిత్రాలను చూడవచ్చు.
అయోధ్యలోని శ్రీరామ మందిరానికి సంబంధించిన చిత్రాల కోసం వెతికినప్పుడు నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని తేలింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా.కామ్ ప్రకారం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ పనుల చిత్రాలను విడుదల చేసింది. ఇది ప్రాజెక్ట్ కు సంబంధించిన పలు విషయాలను స్పష్టం చేసింది. ప్రస్తుతం 90% పనులు పూర్తవ్వగా.. విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ్ లల్లా ప్రతిష్టించే వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనుల పురోగతిని తెలిపే పలు చిత్రాలను న్యూస్ 18లోని కథనం షేర్ చేసింది.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్నది అయోధ్యలోని శ్రీరామ మందిరం కాదు. కోల్కతాలోని దుర్గా పూజ సందర్భంగా నిర్మించిన అయోధ్య రామ మందిరంగా ఉన్న దుర్గా పూజ పండల్. ఆ సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Electric work has been completed at the Shri Ram temple in Ayodhya. The video shows a huge crowd witnessing a heavily illuminated Ayodhya Shri Ram temple.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story