Thu Dec 19 2024 13:14:32 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మనుషులనే చంపగల ఒపియం పక్షి అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి ఎలాంటి నిజం లేదు
పాక్షికంగా మనిషిని.. పాక్షికంగా పక్షి లాంటి లక్షణాలతో ఉన్న ఒక జీవికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది అంటార్కిటికాలో కనిపిస్తుందని.. దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుందని ప్రచారం చేశారు. కాస్త మనిషి రూపంలో కనిపించే జీవి..
Claim :
ఒపియం పక్షి.. ఏకంగా మనుషులనే చంపగలదుFact :
వీడియోలో ఉన్నది ఓపియం పక్షి కాదు. దీన్ని కాస్ట్యూమ్, VFX ద్వారా సృష్టించారు. ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన మీమ్.
పాక్షికంగా మనిషిని.. పాక్షికంగా పక్షి లాంటి లక్షణాలతో ఉన్న ఒక జీవికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది అంటార్కిటికాలో కనిపిస్తుందని.. దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుందని ప్రచారం చేశారు. కాస్త మనిషి రూపంలో కనిపించే జీవి.. తెల్లటి ఈకలతో, పొడవైన ముక్కును కలిగి ఉంటుంది. ఒపియం పక్షి అని కూడా పిలుస్తారు.
ఈ పక్షికి సంబంధించిన మీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పక్షి తన దగ్గరికి వచ్చిన వారిని హిప్నటైజ్ చేసి చంపేస్తుంది అంటూ కూడా ప్రచారం చేశారు. ఈ పక్షి చాలా ప్రమాదకరం అనే కథనంతో కూడా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ పక్షి వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోలో, మంచుతో కప్పబడిన వాతావరణంలో జీవి వంటి పక్షిని మనం చూడవచ్చు.
“Do you know Opium Bird? It can kill within a second if you move closer.” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. మీరు ఈ పక్షికి దగ్గరగా వెళ్లిన వెంటనే చంపేయగలదనే ప్రచారం చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చాలా ప్రమాదకరమైన, ప్రజలను చంపే నిజమైన పక్షి అంటూ చేస్తున్న వాదనకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు.
మేము ఓపియం పక్షి కోసం ఇంటర్నెట్ లో వెతికినప్పుడు, ఈ పక్షి గురించి ఎటువంటి శాస్త్రీయ కథనాలు కనుగొనలేకపోయాం. ఈ పక్షి నిజానికి ఎక్కడా లేదు.
మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను ఉపయోగించి మరింత సెర్చ్ చేశాం.. వీడియో Instagram ఖాతా స్ట్రక్చర్డ్మ్యాగ్ ద్వారా భాగస్వామ్యం చేశారని మేము కనుగొన్నాము. @official_spiritwalker అకౌంట్ లో “Opium bird came to life” అని క్యాప్షన్ ఉంది.
@official_spiritwalker అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాను సెర్చ్ చేశాం. నవంబర్ 1, 2023న హ్యాండిల్ ద్వారా వీడియో పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. “Opium bird came to life #opiumbird #spiritwalker” అనే టైటిల్ తో వీడియో షేర్ చేశారు.
ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ బయో గమనిస్తే “బ్రాండన్ జాన్సన్ కాస్ట్యూమ్ బిల్డర్, ఇన్వెంటర్, ఆడియో ఇంజనీర్, బిజినెస్ ఓనర్”కి చెందినదని వివరించారు.
ఒపియం బర్డ్ కాస్ట్యూమ్ ను తయారు చేస్తున్న వీడియోను కూడా మేము గమనించాం. “I gave it a shot. 7.5ft tall opium bird home made. #spiritwalker #opiumbird” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
అతను కాస్ట్యూమ్ డిజైనర్, ఇంజనీర్, పప్పెటీర్ అని అతని యూట్యూబ్ బయో కూడా పేర్కొంది.
అతని యూట్యూబ్ ఛానెల్లో కూడా ఎక్కువ నిడివి ఉన్న వీడియోను ప్రచురించారు.
మేము ఓపియం బర్డ్ గురించి మరింత సెర్చ్ చేయగా.. ఆ పక్షులను చూపించే వీడియోను drevfx అనే Tiktok వినియోగదారు మొదట అప్లోడ్ చేశాడని మేము కనుగొన్నాము. అతని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలో 'ఓపియం పక్షుల సృష్టికర్త' అని పేర్కొన్నాడు. అతను VFX కళాకారుడు, గ్రాఫిక్స్ ను ఉపయోగించి ఈ పక్షులను సృష్టించాడు.
“Meme from 2027 I Opium bird meme” అనే టైటిల్ తో పలు పక్షులకు సంబంధించిన పోస్టులను మేము గుర్తించాం.
thirdeyefacts.comలోని ఒక కథనం ప్రకారం.. vfx కళాకారుడు తన టిక్ టాక్ హ్యాండిల్లో #AIart #deepfake వంటి హ్యాష్ట్యాగ్లతో చిత్రాలను పంచుకున్నాడు.
medium.comలో ప్రచురించబడిన మరో కథనంలో ఈ జీవిని కృత్రిమ మేధస్సును ఉపయోగించి సృష్టించినట్లు కూడా పేర్కొంది.
మానవులను హిప్నటైజ్ చేసి చంపగల పక్షి అంటూ వైరల్ అవుతున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది ఓపియం పక్షి అంటూ చూపించిన కాస్ట్యూమ్ మాత్రమే. ఇది కేవలం CGI సృష్టి. నిజమైన పక్షి కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral video shows opium bird which can hypnotise and kill people
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story