Mon Dec 23 2024 09:14:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాకెట్ ను తీసుకుని వెళుతున్న ట్రక్కుకు సంబంధించిన వీడియో.. ఓ వీడియో గేమ్ కు సంబంధించినది
భారతదేశం ఆగస్టు 23, 2023న చరిత్రను లిఖించింది. ఇస్రో చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ చేసింది. యుఎస్ఎస్ఆర్, అమెరికా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
Claim :
ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించిన రాకెట్‌ను మోస్తున్న భారీ ట్రక్కు ఇరుకైన వంతెనను దాటుతున్నట్లు వీడియోలో ఉందిFact :
వైరల్ వీడియో “Spritires: Mudrunner” అనే వీడియో గేమ్‌కు సంబంధించిన గేమింగ్ క్లిప్. ఇది చంద్రయాన్-3 రాకెట్ రవాణాను చూపించే అసలు వీడియో కాదు.
భారతదేశం ఆగస్టు 23, 2023న చరిత్రను లిఖించింది. ఇస్రో చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ చేసింది. యుఎస్ఎస్ఆర్, అమెరికా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3ని జూలై 14, 2023న ప్రయోగించారు.
భారీ రాకెట్‌ను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు చాలా ఇరుకైన వంతెనను దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను “చంద్రయాన్-3 రాకెట్ ను మోసుకుని వెళ్తున్నప్పుడు వంతెనను దాటుతున్నప్పుడు ట్రక్ డ్రైవర్ ఎంత మానసిక ఒత్తిడికి లోనయ్యాడో చూడండి, అదే ఆగస్టు 23 సాయంత్రం 5 గంటలకు చంద్రునిపై దిగుతుంది, ఆ రోజు టీవీ లైవ్‌లో చూడండి” అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో వీడియో గేమ్ కు సంబంధించినది. “Spritires: Mudrunner” అనే వీడియో గేమ్ కు సంబంధించిన క్లిప్.
చంద్రయాన్-3 రాకెట్ రవాణా గురించి కథనాల కోసం వెతికగా.. రాకెట్‌ను తయారు చేసి ఇస్రో ప్రయోగ ప్రదేశానికి తరలించినట్లుగా మాకు ఎటువంటి వార్తా కథనాలు కనిపించలేదు. చంద్రయాన్-3 గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది చూడొచ్చు:
మేము వీడియో కు సంబంధించిన కీ ఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. మేము వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించిన అనేక సారూప్య వీడియోలను కనుగొన్నాము.
ఈ వీడియోలు యూట్యూబ్‌లోని గేమింగ్ ట్యాబ్‌కి లింక్ చేసి ఉండడం కూడా గమనించాం.
ఏప్రిల్ 3, 2023న Facebook వినియోగదారు ప్రచురించిన వీడియోలో అదే భారీ ట్రక్కు రాకెట్‌ను మోసుకెల్తూ.. మరో ప్రమాదకరమైన చెక్క వంతెనను దాటుతున్నట్లు చూశాం. వినియోగదారుడు Spintires: Mudrunner అని ట్యాగ్ చేసారు. ఈ పోస్ట్‌లో ‘IDRamadanxGaming’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించారు.
ఆ వీడియో కింద క్యాప్షన్ “This truck carrying the world's largest rocket over a wooden bridge over a dangerous mountain. #IDRamadanxGaming” అని ఉంది.

దీన్ని క్లూగా తీసుకుని “Spintires: Mudrunner” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. అందుకు సంబంధించి మేము ఒక యూట్యూబ్ వీడియో “Aborted Rocket Launch I Game Mudrunner” అని చూశాం. ఆ వీడియోను యూట్యూబ్ లో ఏప్రిల్ 1, 2023న అప్లోడ్ చేశారు.
మేము గేమింగ్ వీడియో సృష్టికర్త అయిన జిమ్ నాటెలో పేరుతో ఫేస్బుక్ పేజీని కూడా కనుగొన్నాము. భారీ ట్రక్కులు నదిపై వంతెనను దాటుతున్న పలు వీడియోలను పోస్ట్ చేశాడు. గేమింగ్ వీడియోలు అప్లోడ్ చేసిన యూజర్ కు సంబంధించిన Facebook పేజీ ఇక్కడ ఉంది.
అందువల్ల, భారీ ట్రక్కు రాకెట్‌ను మోస్తూ ఇరుకైన వంతెన గుండా వెళుతున్న వైరల్ వీడియో “స్పిన్టైర్స్: మడ్రన్నర్” అనే వీడియో గేమ్‌లోని క్లిప్పింగ్ మాత్రమే..! ఇది చంద్రయాన్-3కి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : The video shows a Heavy truck carrying a rocket related to Chandrayaan-3 which landed on the moon on August 23 crossing a small bridge
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story