Mon Dec 23 2024 07:16:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: WHO చీఫ్ కోవిడ్-19 టీకాలు వేయించుకోలేదని పేర్కొంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు.
డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ మే 2017లో ఐదేళ్ల కాలానికి గానూ WHO డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నాయకత్వం వహించిన ఆఫ్రికా ప్రాంతానికి చెందిన మొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
Claim :
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ COVID-19 టీకా వేయించుకోలేదుFact :
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ మే 2021లోనే టీకాలు వేయించుకున్నారు. వైరల్ వీడియో ఒక డాక్యుమెంటరీ నుండి వచ్చిన క్లిప్.
డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ మే 2017లో ఐదేళ్ల కాలానికి గానూ WHO డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నాయకత్వం వహించిన ఆఫ్రికా ప్రాంతానికి చెందిన మొదటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన టెడ్రోస్ ఘెబ్రేయేసస్ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను తీసుకుని.. 'WHO అధినేత COVID-19 టీకాలు వేయించుకోలేదు' అనే వాదనతో ట్విట్టర్లో విస్తృతంగా పోస్టులు చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.మేము “Tedros Ghebreyesus covid vaccine” అనే కీవర్డ్లను ఉపయోగించి సెర్చ్ చేశాం. మే 13, 2021న ఆయన టీకాలు వేయించుకున్న ట్వీట్‌ని మేము కనుగొన్నాము.
తాను టీకాలు వేయించుకున్నానని ఆయన తెలిపారు. “ఈరోజు కరోనా టీకాలు వేయించుకోవడంలో నా వంతు వచ్చింది. టీకాలు మన ప్రాణాలను కాపాడతాయి. మీ దేశాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే దయచేసి మీ వంతు వచ్చినప్పుడు టీకాలు వేయించుకోండి." అంటూ ఆయన ట్విట్టర్ లో ప్రపంచ దేశాల ప్రజలను కోరారు.
మేము మరింత సెర్చ్ చేయగా.. వైరల్ వీడియో క్లిప్ HBO డాక్యుమెంటరీ అయిన “How to survive a Pandemic” లోనిదని మేము గుర్తించాం. ఈ డాక్యుమెంటరీ కరోనా వ్యాక్సిన్స్ కోసం జరిగిన పోరాటాన్ని చూపిస్తుందని మేము ధృవీకరించాం.
జూన్ 12, 2021న జోన్ కోహెన్‌తో టెడ్రోస్ ఘెబ్రేయేసస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని ‘సైన్స్’ వెబ్సైట్లో చూడవచ్చు. తక్కువ-ఆదాయ దేశాలలో COVID-19 వ్యాక్సిన్ల పంపిణీ ఎలా జరుగుతూ ఉంటుందో వివరించారు. ధనిక దేశాలకు కరోనా వ్యాక్సిన్లు తొందరగా వస్తాయని.. అదే తక్కువ ఆదాయాలు ఉన్న దేశాలు అసమానతలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. తాను మే 2021 వరకు టీకాలు వేయించుకోడానికి వేచి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
అందువల్ల, WHO చీఫ్ COVID-19 టీకాలు వేయించుకోలేదనే వాదన తప్పు. ఆయన మే 12, 2021న కోవిడ్-19తో పోరాడడానికి టీకాలు వేయించుకున్నాడు.

Claim : Head of the World Health Organisation Tedros Ghebreyesus is not vaccinated for COVID-19
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story