ఫ్యాక్ట్ చెక్: సెప్టెంబరు 15, 2024న బెంగళూరులో గ్రహశకలం పడడం వైరల్ వీడియో చూపడం లేదు, వీడియో పాతది
ఇటీవల, NASA ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే.
Claim :
సెప్టెంబరు 15, 2024న బెంగళూరులో ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టినట్లు వైరల్ వీడియో చూపుతోందిFact :
ఈ వీడియో బెంగుళూరుకు సంబంధించింది కాదు. ఇది ఇస్తాంబుల్‌లో చిత్రీకరించిన వీడియో
ఇటీవల, నాసా ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందా అని చాలా మందే టెన్షన్ పడ్డారు. '2024 ON' అనే గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోందని, సెప్టెంబర్ 15, 2024న భూమికి దగ్గరగా వెళుతుందని నాసా తెలిపింది. ఆ గ్రహ శకలం 40233 km/h వేగంతో దూసుకువస్తోందని నాసా చెప్పడం, భూమి మీద పడితే సర్వనాశనం జరుగుతుందంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రహశకలం గురించి చర్చ జరిగింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
అనేక టర్కిష్ నగరాలకు చెందిన వినియోగదారులు ఆకాశంలో ఫైర్బాల్లను చూసినట్లు నివేదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి, చాలా మంది ఇది ఉల్కాపాతం కావచ్చునని సూచించారు. షేర్ చేసిన కొన్ని వీడియోలు ఇక్కడ చూడొచ్చు. అయితే, టైమ్స్ నౌ వీడియోల ప్రామాణికతను ధృవీకరించలేదు.
ది గార్డియన్ ప్రకారం, ఉల్కాపాతం సఫ్రాన్బోలు నగరంలో కనిపించింది అనీ, అయితే సఫ్రాన్బోలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్టమోనులో కూడా ఈ ఉల్కపాతం కనిపించింది. ఒక ఉల్కాపాతం టర్కీపై ఆకాశాన్ని వెలిగించింది, మేఘాల గుండా ఆకుపచ్చ కాంతిని ప్రసరించింది.
X పోస్ట్‌లో, టర్కిష్ స్పేస్ ఏజెన్సీ ఉల్కాపాతం జరిగిందని ధృవీకరించింది.