Mon Dec 23 2024 19:29:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కరేబియన్ సముద్రంలోకి HAARP అవుట్‌లెట్‌ను నెలకొల్పారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ (HAARP), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాస్కాలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ ఫెసిలిటీ. ఇది అయానోస్పియర్ లక్షణాలు, ప్రవర్తనను అధ్యయనం చేస్తూ ఉంటుంది. HAARP ద్వారా అయానోస్పియర్ అధ్యయనం కోసం ప్రపంచంలోని అత్యంత సామర్థ్యం గల అధిక-శక్తి, అధిక-ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మీటర్ లను ఉపయోగిస్తారు.
Claim :
వాతావరణ మార్పులను సృష్టించేందుకు కరేబియన్ సముద్రంలోకి HAARP అవుట్‌పోస్ట్‌ని నెలకొల్పినట్టు వైరల్ వీడియో చూపిస్తుందిFact :
వైరల్ వీడియో సముద్ర ఆధారిత X-బ్యాండ్ రాడార్‌ను చూపుతుంది. ఇది బాలిస్టిక్ క్షిపణులను గుర్తించేందుకు ఉపయోగిస్తారు.
హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ (HAARP), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాస్కాలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ ఫెసిలిటీ. ఇది అయానోస్పియర్ లక్షణాలు, ప్రవర్తనను అధ్యయనం చేస్తూ ఉంటుంది. HAARP ద్వారా అయానోస్పియర్ అధ్యయనం కోసం ప్రపంచంలోని అత్యంత సామర్థ్యం గల అధిక-శక్తి, అధిక-ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మీటర్ లను ఉపయోగిస్తారు.
అయానోస్పిరిక్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్, అధిక ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేసే హై-పవర్ ట్రాన్స్‌మీటర్ సౌకర్యం ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనం కోసం అయానోస్పియర్ పరిమిత ప్రాంతాన్ని తాత్కాలికంగా ఉత్తేజపరిచేందుకు IRIని ఉపయోగిస్తారు. ఉత్తేజిత ప్రాంతంలో సంభవించే భౌతిక ప్రక్రియలను గమనించడానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తారు. వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు.
ఈ పరిశోధనా కార్యకలాపాలు ఆగస్ట్ 2015లో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నుండి అలాస్కా ఫెయిర్‌బ్యాంక్స్ విశ్వవిద్యాలయానికి బదిలీ చేశారు. అబ్జర్వేటరీలోని శాస్త్రీయ పరికరాలు ఉపగ్రహ బీకాన్లను ఉపయోగించి అయానోస్పిరిక్ క్యారెక్టరైజేషన్‌ను, అరోరా టెలిస్కోపిక్ పరిశీలన, ఓజోన్ పొరలో దీర్ఘకాలిక వైవిధ్యాలను రికార్డు చేస్తారు.
ఇటీవల, సముద్రపు నీటిలో తేలుతున్న ఓ ఎక్విప్మెంట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. కరేబియన్ సముద్రంలో బయటకు లాగిన HAARP అవుట్‌పోస్ట్‌ను చూపుతుందనే వాదనతో ప్రచారం జరుగుతోంది. వాతావరణంలో మార్పులు తీసుకుని రావడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారనే ప్రచారం కూడా చేస్తున్నారు.
HAARP అవుట్‌పోస్ట్‌ను కరేబియన్ సముద్రం లోకి పంపారంటూ పోస్టులు చేస్తున్నారు. “Nothing to see here - just the latest HAARP Outpost being towed out into the Caribbean Sea in order to generate some more ‘Climate Change’. Look at the size of this thing. You all still think weather manipulation is just a crazy conspiracy though right?” అంటూ పోస్టులు పెట్టారు. HAARP అవుట్‌పోస్ట్ వెనుక కుట్ర ఉందంటూ ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపించే శాస్త్రీయ పరికరం X-బ్యాండ్ రాడార్.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వీడియోలో కనిపించే పరికరం సముద్ర-ఆధారిత X-బ్యాండ్ రాడార్ (SBX) అని మేము కనుగొన్నాము. ఇది US బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఒక భాగం. ఇది బాలిస్టిక్ క్షిపణుల గురించిన సమాచారాన్ని గుర్తించడానికి రూపొందించారు. ఇది విమానంలో గ్రౌండ్-బేస్డ్ ఇంటర్సెప్టర్లను అప్డేట్ చేయడానికి డేటాను కూడా అందిస్తుంది.
missile defence advocacy.org వెబ్సైట్ ప్రకారం SBX ను పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర కొరియా ICBM పరీక్ష ప్రయోగాలను పర్యవేక్షించడానికి మోహరించారు. SBX-1 మార్చి 2023లో హవాయి నుండి బయలుదేరింది.
hawaiinewsnow.comలో ప్రచురించిన నివేదిక ప్రకారం మార్చి 2023లో పెర్ల్ హార్బర్లోని భారీ గోల్ఫ్ బాల్ లాంటి నిర్మాణం US మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ సముద్ర-ఆధారిత X-బ్యాండ్ రాడార్ - SBX-1 ను అక్కడ ఉంచారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన తరలించగలిగిన రాడార్.
దాదాపు 72 మంది సిబ్బంది ఓడలో భాగంగా ఉన్నారు. ప్రతి 9 వారాలకు సిబ్బంది మారుతూ ఉంటారు.
మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ, USA ప్రచురించిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం SBX అనేది మొబైల్, ఓషన్-గోయింగ్, సెమీ-సబ్మెర్సిబుల్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచిన అధునాతన X-బ్యాండ్ రాడార్. ఇది క్షిపణి రక్షణ వ్యవస్థను అందిస్తుంది. దీంతో ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని అయినా కవర్ చేయడానికి ఉపయోగించవచ్చు. అత్యంత శక్తివంతమైన, సామర్థ్యం గల రాడార్‌తో, వివిధ క్షిపణి వ్యవస్థలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కంప్లీట్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది.
US నేవీకి సంబంధించిన మిలిటరీ సీలిఫ్ట్ కమాండ్ వెబ్సైట్ కూడా సముద్ర ఆధారిత X-బ్యాండ్ రాడార్ క్లోజప్ చిత్రాన్ని ప్రచురించింది. HAARP చుట్టూ అనేక కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి, వీటిని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండించాయి. కరేబియన్ సముద్రంలోకి HAARP అవుట్‌లెట్‌ను లాగారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది సముద్ర ఆధారిత ఎక్స్-బ్యాండ్ రాడార్. ఇది బాలిస్టిక్ క్షిపణులను గుర్తించేందుకు ఉపయోగిస్తారు.
Claim : వాతావరణ మార్పులను సృష్టించేందుకు కరేబియన్ సముద్రంలోకి HAARP అవుట్‌పోస్ట్‌ని లాగినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story