Mon Apr 07 2025 02:15:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో భారతదేశంలో హొలీ వేడుకలకు సంబంధించింది కాదు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఇది రంగులు పూసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా

Claim :
భారతదేశంలో హోలీ వేడుకలను చూపించే వైరల్ వీడియోFact :
వైరల్ వీడియో భారతదేశంలోని హోలీ పండుగకు సంబంధించినది కాదు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఇది రంగులు పూసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ. హిందూ క్యాలెండర్‌లోని ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున ఈ ఆచారాన్ని పాటిస్తారు. ప్రతి సంవత్సరం, హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ వేడుకలో పాల్గొంటారు. స్వీట్ల సువాసనలతో, ఉల్లాసమైన పాటల ధ్వనితో, ప్రతిచోటా ప్రకాశవంతమైన రంగులతో నిండి ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను సందర్శిస్తారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఈ సందర్భంగా చింతలు తొలగిపోయి, చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో భారతదేశంలో జరుపుకునే హోలీ పండుగకు సంబంధించినది కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికాం. ఈ వీడియో ఫిబ్రవరి 2025 నుండి ఆన్లైన్లో ఉందని మేము కనుగొన్నాము. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అదే వీడియోను చైనాలో చోటు చేసుకుందిగా చెబుతూ పోస్టులు పెట్టారు. “China gets it done!! The 16th day of the first lunar month. This date follows the Lantern Festival on February 12, 2025, which marks the culmination of the Chinese New Year celebrations. While the 16th day is not a major national festival, it holds cultural significance in certain regions and communities across China.” అంటూ పోస్టులు పెట్టారు.
చంద్రమానం ప్రకారం మొదటి నెలలో 16వ రోజును చైనీయులు ఎంతో సంతోషంతో జరుపుకుంటారు. ఫిబ్రవరి 12, 2025న లాంతర్ పండుగ తర్వాత ఇది జరుపుకున్నారు. చైనీస్ నూతన సంవత్సర వేడుకల ముగింపును సూచిస్తుంది. ఇది చైనాలో ప్రధాన పండుగ కానప్పటికీ, చైనాలోని కొన్ని ప్రాంతాలు, సమాజాలలో సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ వీడియో ఫిబ్రవరి 19, 2025న ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
“The sixteenth day of the first lunar month in China #treinding #fireworks #video” అనే క్యాప్షన్ తో ఈ వైరల్ వీడియోను ఫిబ్రవరి 17, 2025న యూట్యూబ్‌లో కూడా షేర్ చేశారు.
వసంతోత్సవం అని కూడా పిలువబడే చైనీస్ నూతన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉత్సాహభరితమైన సాంస్కృతిక వేడుకలలో ఒకటి. చైనీస్ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఈ పండుగ చాలా రోజుల పాటు నిర్వహిస్తారు. ఆనందం, ఐక్యత, రంగురంగుల ఉత్సవాలు ఈ సందర్భంగా జరుగుతూ ఉంటాయి. ఆకట్టుకునే కవాతులు, లయన్ డ్యాన్స్, కుటుంబాలు, స్నేహితుల కలయికల వరకు ఎన్నో గొప్ప ఆచారాలు ఇందులో భాగమై ఉన్నాయి.
2025లో, చైనీస్ నూతన సంవత్సరం స్నేక్ ఇయర్ కు నాంది పలుకుతున్నందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది చైనీస్ సంస్కృతిలో జ్ఞానం, దయ, పరివర్తనకు చిహ్నం. ఉల్లాసమైన వీధి ప్రదర్శనలు అయినా, అందరితో కలిసి విందులు అయినా లేదా ప్రతీకాత్మక ఆచారాలు అయినా, ఈ పండుగలోని ప్రతి అంశం లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం 2025 ముఖ్య వివరాలను, దాని ప్రాముఖ్యతను, ప్రపంచవ్యాప్తంగా దానిని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.
2025 చైనీస్ నూతన సంవత్సరం ఎప్పుడు?
చైనీస్ నూతన సంవత్సరం చంద్రుడి క్యాలెండర్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి, ఇది ప్రతి సంవత్సరం వేరే తేదీన వస్తుంది. చైనీస్ నూతన సంవత్సరం జనవరి 29, 2025న ప్రారంభమవుతుంది. ఈ తేదీ కొత్త చంద్ర సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది, ఇది జనవరి 21- ఫిబ్రవరి 20 మధ్య వస్తుంది. చైనీస్ నూతన సంవత్సర తేదీ చంద్రుడి క్యాలెండర్ ప్రకారం మారుతుంది, ఇది సౌర సంవత్సరం ఆధారంగా ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్‌తో పోలిస్తే చంద్రుని చక్రాలపై ఆధారపడి ఉంటుంది. లాంతర్ పండుగ కొత్త చంద్ర సంవత్సరం పదిహేనవ రోజున నిర్వహిస్తారు.
2025 చైనీస్ నూతన సంవత్సరం ఎంతకాలం ఉంటుంది?
2025 చైనీస్ నూతన సంవత్సరం, జనవరి 29, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు జరిగింది. ఈ సెలవుదినం సాంప్రదాయకంగా 16 రోజులు జరుపుకుంటారు, మొదటి 7 రోజులు అధికారిక ప్రభుత్వ సెలవు దినాలు. 2025లో జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు నిర్వహించారు. ఈ సమయంలో కుటుంబసభ్యులు అందరూ కలిసి విందులు ఉంటాయి. అదృష్టం కోసం ఎరుపు రంగు కవర్లను మార్చుకోవడం, బహుమతులను ఇచ్చుకోవడం వంటి వివిధ సంప్రదాయాలతో జరుపుకుంటారు. వేడుకలకు సంబంధించి చివరి రోజుల్లో పూర్వీకులను గౌరవించడం, రాబోయే సంవత్సరానికి వారి ఆశీర్వాదాలు కోరడం జరుగుతూ ఉంటాయి.
అనిమల్ ఆఫ్ ది ఇయర్: పాము (2025)
ప్రతి చైనీస్ నూతన సంవత్సరం చైనీస్ రాశిచక్రంలోని 12 జంతువులలో ఒకదానితో ముడిపడి ఉంటుంది. డ్రాగన్ సంవత్సరం (2024) తర్వాత, స్నేక్ ఇయర్ 2025లో ప్రారంభమైంది. చైనీస్ రాశిచక్రం ప్రతి సంవత్సరానికి ఒక జంతువును కేటాయించారు. ఈ చక్రం 12 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ చక్రంలో ఆరవ జంతువు అయిన పాము దయ, తెలివితేటలు, అంతర్ దృష్టి వంటి లక్షణాలను సూచిస్తుంది.
స్నేక్ ఇయర్ లో జన్మించిన వ్యక్తులకు తెలివితేటలు, దయ, సున్నితత్వం వంటి లక్షణాలను కలిగి ఉంటారని భావిస్తారు. వారు స్వతంత్రులుగా, దృఢ సంకల్పం కలిగి ఉంటే అడ్డంకులను అధిగమించగల సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తులని కూడా నమ్ముతారు.
చైనా: బాణాసంచా- జానపద కథలు
చైనాలో స్థానికులు, పర్యాటకులు చంద్ర నూతన సంవత్సరాన్ని బాణసంచా కాల్చడం ద్వారా జరుపుకుంటారు. ఇది అక్కడి ప్రజల్లో పాతుకుపోయిన సంప్రదాయం. పురాణాల ప్రకారం, ఈ పెద్ద శబ్దాలు దుష్టశక్తులను, ముఖ్యంగా చైనీస్ పౌరాణికాల్లోని రాక్షసుడు నియాన్‌ను దూరం చేస్తాయని నమ్ముతారు. ఆ రాక్షసుడు సంవత్సరం ప్రారంభంలో గ్రామాలను భయపెడుతాడని నమ్ముతారు. ఎరుపు అలంకరణలు, కొవ్వొత్తులు, పటాకుల పేలుళ్లు నియాన్‌ను భయపెడతాయని ఎన్నో కథల్లో చెప్పారు. ఈ ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, కాలుష్యం, భద్రతపై ఆందోళనల కారణంగా కొన్ని నగరాలు బాణసంచా పేల్చడాన్ని నిషేధించాయి.
వీడియో చిత్రీకరించిన ప్రదేశం, తేదీని మేము నిర్ధారించలేకపోయినా, ఆ వీడియో భారతదేశం నుండి వచ్చింది కాదని, హోలీకి సంబంధించినది కాదని మేము నిర్ధారించగలము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భారతదేశంలో హోలీ వేడుకలను చూపించే వైరల్ వీడియో
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story