ఫ్యాక్ట్ చెక్: వైరల్ విజువల్స్ కు వైసీపీ కి ఎలాంటి సంబంధం లేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగమైన టీడీపీ, జనసేన పార్టీలు 135 సీట్లు గెలుచుకున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
Claim :
ఏపీలో వరద బాధిత ప్రాంతాలను వైఎస్ జగన్ సందర్శించినప్పుడు కనిపించిన జనసమూహంFact :
భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ సమయంలో ముంబైకి చెందిన వీడియో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగమైన టీడీపీ, జనసేన పార్టీలు 135 సీట్లు గెలుచుకున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకుంది. వైసీపీ ప్రచారానికి భారీ మొత్తంలో జనం వచ్చారు. పార్టీ నిర్వహించిన పలు ర్యాలీలు, కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం వచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలకు పైగా కావస్తున్నా.. ఎన్నికల సమయంలో అసలు ఏం జరిగిందనే ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో తగ్గడం లేదు. ఈవీఎం ట్యాంపరింగ్, ఎన్నికల ఫలితాల విషయంలో తేడాలు జరిగాయంటూ పలువురు వైఎస్ఆర్సీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేశారు.