ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే సీతక్క విమర్శించలేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2024 నాటికి ఒక సంవత్సరం పాలన

Claim :
ఎన్నికల హామీలను నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క విమర్శించిన వీడియో వైరల్గా మారిందిFact :
తప్పుడు వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సీతక్క ఈ వ్యాఖ్యలు చేయలేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2024 నాటికి ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు వాగ్ధానాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో మునుపటి BRS ప్రభుత్వం చేయని ఎన్నో అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ హామీల గురించి పలు సందర్భాలలో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
పెండింగ్లో ఉన్న హామీలను పూర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, అధికార పార్టీని ఇబ్బందులు పెట్టడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. సంచలనాత్మక వ్యాఖ్యలకు పేరుగాంచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు చూపించే వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో, ముందుగా వివిధ సందర్భాలలో వివిధ బహిరంగ సభలలో ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలను మనం వినవచ్చు. తరువాత సీతక్క "ఇలాంటి విషయాలు చెప్పే ముందు సిగ్గుపడాలి, ప్రజలు ఏదైనా నమ్మేస్తారని అనుకుంటారు, కానీ ఏదైనా చేసే ముందు లేదా చెప్పే ముందు కొన్ని నైతిక విలువలు కలిగి ఉండాలి" అని చెప్పడం మనం వినవచ్చు.
“ఇప్పుడు సీతక్క కూడా నిన్ను నిలదీస్తుంది గుంపుమేస్త్రి” అనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
క్లెయిమ్ ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన లో ఎలాంటి నిజం లేదు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె వ్యాఖ్యానించడం లేదని, తప్పుడు వాదనతో ఈ వీడియోను ఎడిట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యల గురించి వార్తల నివేదికల కోసం మేము శోధించినప్పుడు, అటువంటి నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని శోధించినప్పుడు, బిగ్ టీవీ నల్గొండ నిర్వహించిన ఇంటర్వ్యూను మేము కనుగొన్నాం.
' మంత్రి సీతక్క స్పెషల్ ఇంటర్వ్యూ | తముడు రేవంత్ కి నా సూచన ఇదే.. | CM రేవంత్ రెడ్డి | BIGTV.' అనే టైటిల్ తో ఈ ఇంటర్వ్యూ మార్చి 6, 2025న అప్లోడ్ చేశారు. వైరల్ భాగాన్ని 6.22 నిమిషాల నుండి 6.30 నిమిషాల వరకు చూడవచ్చు. ఇంటర్వ్యూలోని కంటెంట్ సందర్భానికి భిన్నంగా ఉపయోగించారు. ఈ వీడియోలో, మంత్రులు, ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క చెప్పడం మనం వినవచ్చు.
ఇంటర్వ్యూలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కీలకమైన పనుల గురించి ఆమె చెప్పడం వినవచ్చు. ప్రభుత్వం చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు తమ ఎజెండాను అమలు చేస్తున్నాయని కూడా ఆమె పేర్కొంది. ఇంటర్వ్యూ అంతటా, ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ విధి విధానాలకి మద్దతు ఇస్తూ కనిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
అదే వీడియోను మార్చి 5, 2025న బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ అనే హ్యాండిల్ Xలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. సీతక్క ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం చూడవచ్చు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని తెలుస్తోంది.
ఈ వీడియో "గడిచిన పదేళ్లు స్వర్ణయుగమే అయితే ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటారు? పదవులు పోయాయనే అక్కసుతో ఏ మంచి పని చేసినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము వర్క్ బిజీలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ వాగుడు బిజీలో ఉన్నాయి. వాళ్ల తప్పులను వాళ్లు తెలుసుకోకుండా ప్రజలదే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. గతంలో మహిళ అంటే ఒక్క కల్వకుంట్ల కవితే అనే విధంగా చూపించారు. మా లాంటి కింది వర్గాల బిడ్డలు ఎదిగితే వాళ్లు తట్టుకోలేరు - మంత్రి సీతక్క" అనే క్యాప్షన్ తో షేర్ చేసారు, ఇందులో ఎక్కడా రేవంత్ రెడ్డి ని విమర్శిస్తున్నట్టు లేదు. అందులో కాంగ్రెస్ ఎం ఎల్ ఏ సీతక్క మట్లాడినవి వక్రీకరించి తప్పుడు వాదన తో షేర్ చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలపై కాంగ్రెస్ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను తప్పుడు వాదనలతో షేర్ చేస్తున్నారు.