ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో వక్ఫ్ బిల్ కు సంబంధించింది కాదు, 2015 లో జరిగిన నిససన ను చూపుతోంది
భారతీయ ముస్లింలు శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయల విలువైన ఆస్తులను నియంత్రించే పాత చట్టాన్ని సవరించాలని వక్ఫ్
Claim :
వక్ఫ్ బోర్డుకు మద్దతుగా, వక్ఫ్ బిల్ కు వ్యతిరేకం గా ప్రజలు చేపట్టిన ఊరేగింపును నియంత్రించే ప్రయత్నం లో పోలిసులు లాఠీచార్జ్ చేసారు.Fact :
వైరల్ వీడియో పాతది, ఇది 2015లో మదర్సా ఉపాధ్యాయుల నిరసనను చూపిస్తోంది
భారతీయ ముస్లింలు శతాబ్దాలుగా విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయల విలువైన ఆస్తులను నియంత్రించే పాత చట్టాన్ని సవరించాలని వక్ఫ్ బిల్లు ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు ప్రస్తుత చట్టానికి 40 సవరణలను చేయాలని ప్రతిపాదిస్తోంది. దీంతో ముస్లిం వర్గాల్లో కలవరం మొదలైంది. ‘వక్ఫ్’ అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు ఉద్దేశించిన ధర్మబద్ధమైన, మతపరమైన లేదా ధార్మికమైన పదం. దీని గురించి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. మొదటి వక్ఫ్ చట్టానికి 1954లో ఆమోదముద్ర వేశారు. 1995లో మొదటిసారి దీనికి సవరణలు చేసి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. 2013లో రెండోసారి సవరణ చేశారు.
వినియోగదారులు వీడియోను హిందీలో “बिहार- पटना में वक्फ बोर्ड के समर्थन में जूलूस निकाल कर उपद्रव कर रहे समुदाय विशेष के लोग भूल गए की यह लालू और तेजस्वी की सरकार नहीं हैं!* *नीतीश कुमार और बीजेपी गठबंधन की सरकार है, पुलिस ने पहले तो इन्हें प्यार से समझाया, और ये मानने को तैयार न थे तब मजबूरन पुलिस को इनकी जमकर खातिरदारी करनी पड़ी। “
దీనిని అనువదించగా క్లెయిం ఇలా ఉంది, “బీహార్- పాట్నాలో వక్ఫ్ బోర్డుకు మద్దతుగా ఊరేగింపు నిర్వహించారు. ఒక వర్గానికి చెందిన వీరు, ఇది లాలు ప్రభుత్వం కాదని మర్చిపోయారు. ఇది నితీష్ కూమార్ ప్రభుత్వం. ముందుగా, పోలిసులు ప్రేమగా వారికి నచ్చచెప్పారు, కానీ వారు వినకపోవడంతో బుద్ధి చెప్పారు. " అనే క్యాప్షన్ తో వీడియో వైరల్ అవుతోంది.
క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వాదన తప్పుదారి పట్టించేది. వీడియో 2015 సంవత్సరం నాటిది.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి వాటిని శోధించగా, అదే వీడియోను మే 2019లో పూర్తిగా భిన్నమైన కథనంతో మహమ్మద్ హసనుజ్జమాన్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.
ఇదే వీడియోను ఇతర వినియోగదారులు ఏప్రిల్ 2018లో కూడా ప్రచురించారు.
ఈ వీడియోలలో కొన్నింటిలో, ఒక వ్యక్తి, మదర్సాల నుండి జీతాలు డిమాండ్ చేస్తున్నామని, మా డిమాండ్లు నెరవేరడం లేదనీ, పోలీసులు మమ్మల్ని కొడుతున్నారని చెప్పడం మనం వినవచ్చు.
అదే వీడియోను మిడ్-డే ఇండియా యూట్యూబ్ ఛానెల్ సెప్టెంబర్ 2018లో ప్రచురించింది. అందులో మదార్సా టీచర్లు చేస్తున్న నిరసన లో పోలీసులు లాఠీచార్జి చేసినందు వల్ల చాలా మంది గాయపడారు అంతూ యాంకర్ చెప్పడం మనం వినవచ్చు. మాదార్సా టీచర్లు, వారికి రెండేళ్లుగా జీతాలు రావడం లేదనీ, రావాల్సిన బకాయిలు చెల్లించాలనీ నిరసన కి దిగారు. అంటూ కూడా యాంకర్ చెప్తుంది.
అలాగే, ఆగస్ట్ 2015లో Mid.day.comలో ప్రచురించబడిన ఒక నివేదిక బీహార్‌లోని పాట్నా నగరంలో నిరసన చేస్తున్న మదార్సా ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో చాలా మందికి గాయాలయ్యాయి. రెండేళ్లుగా తమ బకాయిలు చెల్లించనందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ స్టేట్ మదర్సా టీచర్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఉపాధ్యాయులు నిరసన చేస్తున్నారు.
అందువల్ల, వైరల్ వీడియో ఇటీవలిది కాదు, 2015లో బీహార్‌లో మదర్సా ఉపాధ్యాయులు 2 సంవత్సరాల నుండి జీతాలు పొందడం లేదని నిరసనలను చేయడం చూపుతోంది. నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇది వక్ఫ్ బిల్లుకు సంబంధించినది కాదు. వాదన తప్పుదారి పట్టించేది.