ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో కేరళ లోని వాయనాడ్ కు చెందింది కాదు, జపాన్ కు సంబంధించినది.
జూలై 30, 2024 తెల్లవారుజామున భారతదేశంలోని కేరళలోని వయనాడ్ జిల్లాలోని పుంజిరిమట్టం, ముండక్కై, అట్టమల, మెప్పడై, ఇతర గ్రామాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఈ విధ్వంసం జరిగింది.
Claim :
కేరళలోని వాయనాడ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన ఘటన ఇదిFact :
వైరల్ వీడియో పాతది. 2021లో అటామీ జపాన్‌లో సంభవించిన ఘటన ఇది.
జూలై 30, 2024 తెల్లవారుజామున భారతదేశంలోని కేరళలోని వయనాడ్ జిల్లాలోని పుంజిరిమట్టం, ముండక్కై, అట్టమల, మెప్పడై, ఇతర గ్రామాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఈ విధ్వంసం జరిగింది. బురద, నీరు ఆ ప్రాంతాలను తుడిచిపెట్టేశాయి. వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటన.. కేరళ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. 429 మందికి పైగా మరణించారు, 378 మందికి పైగా గాయాలు. 130 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
జూలై 3, 2021 ఉదయం, జపాన్‌లోని షిజుయోకా ప్రిఫెక్చర్‌లోని అటామిలోని ఇజుసాన్ జిల్లాలో ఐజోమ్ నది వద్ద మట్టి, శిధిలాలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ఈ భీభత్సం వల్ల 26 మంది మరణించారు, ఒక వ్యక్తి తప్పిపోయారు, 128 ఇళ్లు దెబ్బతిన్నాయి.
2021 నాటి నుంచీ ఈ వీడియో ఎన్నో సార్లు వివిధ ప్రదేశాలకు చెందినదిగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల, ఈ వీడియో ఇటలీ కి చెందినది అంటూ ప్రచారం జరిగినప్పుడు, దానిని కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు పరిశీలించి తప్పుడు ప్రచారం అంటూ తేల్చి చెప్పాయి.