Thu Nov 14 2024 22:39:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ ఓడిపోయాక ఓ అమ్మాయి ఏడుస్తున్న వీడియో భారత్ కు చెందినది కాదు
2023.. ICC పురుషుల వన్డే ప్రపంచ కప్ మొదలైంది. ప్రపంచ కప్ 13వ ఎడిషన్ లో 10 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ మ్యాచ్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పాక్‌పై అద్భుత విజయం సాధించింది భారత్. ఈ ఓటమిపై పాకిస్థాన్ అభిమానులు ఎంతో బాధను వ్యక్తం చేశారు.
Claim :
ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ జట్టు భారత్ చేతిలో ఓడిపోవడంతో బాబర్ ఆజామ్ ఇండియా ఫ్యాన్ ఏడుస్తోందిFact :
వీడియోలో ఏడుస్తూ కనిపించిన అమ్మాయి భారతీయురాలు కాదు. ఆమె పాకిస్థానీ, వీడియో పాతది. ప్రపంచ కప్ 2023లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోలేదు.
2023.. ICC పురుషుల వన్డే ప్రపంచ కప్ మొదలైంది. ప్రపంచ కప్ 13వ ఎడిషన్ లో 10 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ మ్యాచ్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పాక్‌పై అద్భుత విజయం సాధించింది భారత్. ఈ ఓటమిపై పాకిస్థాన్ అభిమానులు ఎంతో బాధను వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌లోని పలు మీడియా ఛానెల్‌లు నిరాశ చెందిన పాక్ అభిమానులతో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను కలిసిన తర్వాత ఓ అభిమాని తెగ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “బాబర్ ఆజం ఫ్యాన్ ఇన్ ఇండియా | బాబర్ అజామ్ కోసం ఏడుస్తున్న భారతీయ అభిమాని #cwc2023 #cricket #iccworldcup2023 #babar" అంటూ పోస్టులు పెడుతున్నారు. బాబర్ ఆజమ్ ను చూడగానే ఇండియాలో ఉన్న అతడి ఫ్యాన్ తెగ ఏడ్చేసిందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
మ్యాచ్ ఓడిపోయినా భారత్ కు చెందిన బాలిక హృదయాలను గెలుచుకున్నారనే వాదనతో ఇదే వీడియోను షేర్ చేస్తున్నారు.
మ్యాచ్ ఓడిపోయినా భారత్ కు చెందిన బాలిక హృదయాలను గెలుచుకున్నారనే వాదనతో ఇదే వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ వీడియోలోని అమ్మాయి భారతీయురాలు కాదు. పాకిస్థానీ క్రికెట్ ఫ్యాన్. ఈ వీడియో ఇటీవల ప్రపంచ కప్ సమయంలో చోటు చేసుకున్నది కూడా కాదు.వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో “సదరన్ పంజాబ్ క్రికెట్” అనే భారీ ప్లకార్డులను మనం చూడవచ్చు. సెర్చ్ చేసినప్పుడు పాకిస్థాన్ లోని దక్షిణ పంజాబ్ క్రికెట్ జట్టు కి చెందినదని మేము గుర్తించాము. వీడియోలో కనిపిస్తున్న లోగో పాకిస్థాన్‌కు చెందిన దేశవాళీ క్రికెట్ జట్టుకు చెందినది.
అమ్మాయిలు వేసుకున్న జాకెట్లపై పీసీబీ లోగోలను కూడా మనం వీడియోలో చూడవచ్చు.
ATF దక్షిణ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక Facebook పేజీ వారు దక్షిణ పంజాబ్, ముల్తాన్, పాకిస్థాన్ కు సంబంధించినదని వివరించింది.
మేము వీడియో నుండి తీసుకున్న కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆ వీడియో డిసెంబర్ 2022 నాటిదని మేము కనుగొన్నాము.
డిసెంబర్ 12, 2022న BBN స్పోర్ట్స్ ఛానెల్లో “బాబర్ ఆజంతో సెల్ఫీ తర్వాత ఏడుస్తున్న ముల్తానీ అమ్మాయి” అనే శీర్షికతో YouTube లో వీడియోను అప్లోడ్ చేశారు. ఇక్కడ వైరల్ వీడియోకు సంబంధించిన పొడవైన వీడియోను మనం గుర్తించవచ్చు.
“Multani girl crying after selfie with Babar Azam” అనే టైటిల్ ఉన్న వీడియో.
Samaa TV కూడా తమ యూట్యూబ్ ఛానల్ లో “After meeting Babar Azam, a girl started crying profusely | SAMAA TV | 12th December 2022” అంటూ వీడియోను పోస్టు చేసింది.

BBN స్పోర్ట్స్ మరియు Samaa TV రెండూ పాకిస్థాన్‌కు చెందినవి. BBN స్పోర్ట్స్ అనేది పాకిస్తాన్ క్రికెట్, భారతదేశ క్రికెట్ కు సంబంధించిలోతైన విశ్లేషణను అందించే ఒక స్పోర్ట్స్ న్యూస్ ఛానెల్. BBNలో టీవీ, వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ప్రొఫెషనల్ జర్నలిస్టుల బృందం ఉంది.
SAMAA TV అనేది పాకిస్తాన్‌లోని 24 గంటల జాతీయ టెలివిజన్ ఛానెల్.
అదే వీడియోకు సంబంధించిన కొన్ని ఇతర లింక్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి.
వైరల్ వీడియోలో బాబర్ అజామ్‌ను కలిసిన తర్వాత పాకిస్తాన్ అమ్మాయి ఏడుస్తున్నట్లు చూపిస్తుంది. అహ్మదాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత భారతదేశానికి చెందిన అమ్మాయికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Babar Azam’s Indian girl fan crying after Pakistan team lose to India in World Cup Cricket match
Claimed By : YouTube and Instagram users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story