Fri Nov 22 2024 22:26:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అనంతపురం జిల్లాలో హైవేపై చిరుత అంటూ వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
హైవేపై ఫుట్‌పాత్ పక్కన కూర్చున్న చిరుతపులి ప్రజల మీద దాడి చేస్తోందంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
హైవేపై ఫుట్‌పాత్ పక్కన కూర్చున్న చిరుతపులి ప్రజల మీద దాడి చేస్తోందంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని బెంగళూరు-బళ్లారి హైవేపై చిరుతపులి కనిపించిందని చెబుతూ వస్తున్నారు.“అనంతపురం జిల్లా. 'అనంత'లో హైవేపై బైఠాయించిన చిరుత.. హడలెత్తిపోతున్న వాహనదారులు. రాయదుర్గం నియోజకవర్గం, డీ.హీరేహాళ్ మండలం, ఓబులాపురం గ్రామం బెంగళూరు-బళ్లారి హైవే చెక్ పోస్ట్్ప మంగళవారం రాత్రి ఓ చిరుతపులి నడిరోడ్డపై సంచరిస్తూ అక్కడే బైఠాయించింది. సుమారు రెండు గంటలపాటు ఆ పరిసరాల్లోనే తిరుగుతూ కనిపించింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.”
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.అనంతపురం జిల్లా బెంగుళూరు-బళ్లారి హైవేపై చిరుత కనిపించిందన్న వాదనలో నిజం లేదు. కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని గడగ్ బింకాడకట్టి రోడ్డులో చిరుతపులి కనిపించింది.వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను Google రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించగా.. వైరల్ వీడియోను ప్రచురించిన కొన్ని కథనాలను మేము కనుగొన్నాము.న్యూస్ఫస్ట్ కన్నడ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను పోస్టు చేసింది. “ಗದಗದ ಹೈವೇಲಿ ಮಲಗಿದ ಚಿರತೆ” టైటిల్‌తో షేర్ చేసింది. దీన్ని బట్టి కర్ణాటకలోని గదగెరె(గడగ్) అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.న్యూస్ 18 కన్నడ చిరుతపులికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. “A leopard has been spotted near Binkadakatti in Gadag. A leopard was seen on the Gadag-Hubli road and the passengers captured the scene of the leopard on their mobile phones.” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు. గడగ్‌లోని బింకాడకట్టి సమీపంలో చిరుతపులి కనిపించిందని.. గడగ్-హుబ్లీ రహదారిపై చిరుతపులి కనిపించగా.. అటుగా వెళుతున్న ప్రయాణికులు చిరుతపులిని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇందుకు సంబంధించిన కథనాలను ప్రచురించింది. 57 సెకన్ల వీడియోలో, చిరుతపులి చుట్టూ వాహనాలు వెళుతూ ఉండగా.. రోడ్డు పక్కనే ఆ చిరుత కూర్చున్నట్లు కనిపించింది.గడగ్‌లోని జంతుప్రదర్శనశాల నుంచి చిరుత పారిపోయిందన్న వాదనను అటవీశాఖ అధికారులు తోసిపుచ్చారు. అడవి నుండి చిరుతపులి వచ్చిందని నిర్ధారించారు. ఆ చిరుత షాక్ లో ఉందని.. గాయపడలేదని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని బెంగళూరు-బళ్లారి హైవేపై చిరుత విశ్రమిస్తున్నట్లు చెబుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఈ చిరుతపులి కనిపించింది.
Claim : Leopard sighted on Bengaluru- Bellari highway
Claimed By : Youtube videos
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Youtube
Fact Check : False
Next Story