ఫ్యాక్ట్ చెక్: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి అంబులెన్స్ సదుపాయం ఇవ్వలేదన్న వాదన నిజం కాదు
జనవరి 8, 2025న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని తిరుమల తిరుపతి దేవస్థానం
Claim :
తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయలేదుFact :
ఆ వీడియో పాతది, తిరుమల ఘటనతో ఎలాంటి సంబంధం లేదు
జనవరి 8, 2025న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టిక్కెట్టు కౌంటర్ సమీపంలోని విష్ణు నివాసం సమీపంలో 'దర్శనం' టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. తొక్కిసలాటలో మల్లిక (49), నిర్మల (52), లావణ్య (40), రజిని (47), నాయుడుబాబు (51), శాంతి (34) అనే ఆరుగురు మృతి చెందారు. తిరుపతిలోని విష్ణు నివాసం ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తుల కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
(హెచ్చరిక: వీడియో లో సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, జాగ్రత్త వహించాలని సూచన)
క్లెయిం ఆర్కైవ్ లింకు ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
(హెచ్చరిక: వీడియో లో సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, జాగ్రత్త వహించాలని సూచన)