ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో ప్రజలకు అవగాహన కల్పించడంలో ఒక భాగం
భారతదేశం విభిన్న సంస్కృతులకు, అద్భుతలకు, గొప్ప వారసత్వ సంపదకు నిలయం. ఎన్నో మతాలకు చెందిన వాళ్లు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు

Claim :
ఒక టీవీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారంలో కుల్దీప్ మిశ్రా అనే వ్యక్తి తన మ్యాజిక్ ట్రిక్‌లో భాగంగా కొబ్బరి కాయను గాల్లో ఎగరేస్తున్నారుFact :
అమాయక ప్రజలను మోసం ఎలా చేస్తున్నారో న్యూస్ నేషన్ సంస్థ అవగాహన కార్యక్రమంలో ఆయన భాగమయ్యారు
భారతదేశం విభిన్న సంస్కృతులకు, అద్భుతలకు, గొప్ప వారసత్వ సంపదకు నిలయం. ఎన్నో మతాలకు చెందిన వాళ్లు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని సాధువుల భూమిగా పరిగణిస్తారు. అనేక మంది గొప్ప గొప్ప సాధువులు, గురువులు తమ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక అవగాహనను ప్రజలకు పంచారు. ఆయన వ్యక్తుల బోధనలు, ప్రత్యేకతలు కారణంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచారు. అలాంటి వ్యక్తులు చెప్పిన దాన్ని నమ్మే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారిని దైవంగా భావించి కొలిచేవాళ్లు కూడా లేకపోలేదు. కొందరి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, మోసగాళ్ళు సాధువుల వేషంలో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. మోసం చేయడాన్నే పనిగా పెట్టుకుని చిన్న చిన్న టెక్నీక్లను నేర్చుకుని తామే దేవుళ్లుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
మొదటగా, వీడియో మొదట న్యూస్ నేషన్ షేర్ చేసిన డిస్క్లైమర్ ను చూడొచ్చు. ఈ డిస్క్లైమర్ ఇలా ఉంది. "డిస్క్లైమర్ - 'ఆపరేషన్ పాఖండ్' అనేది న్యూస్ నేషన్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డిబేట్ సీరీస్. న్యూస్ నేషన్ లక్ష్యం ఎవరి మనోభావాలను లేదా నమ్మకాలను దెబ్బతీయడం కాదు; బదులుగా, అద్భుత శక్తులను చూపించే వారి గురించి మిమ్మల్ని హెచ్చరించడమే లక్ష్యం. న్యూస్ నేషన్ ఎలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించదు" అని పేర్కొంటూ అన్ని వీడియోలపై ఒక డిస్క్లైమర్ ప్రచురించబడింది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మార్చి 3, 2025న న్యూస్ నేషన్ ప్రచురించిన వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. దాని శీర్షిక “Operation Pakhand: बाबा का दावा, अभिमंत्रित जल से होगा इलाज? udta nariyal Viral Video news nation” అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు. వీడియోలో, దయానంద్ మహారాజ్ అనే వ్యక్తితో వాదిస్తున్న కొంతమందిని చూడవచ్చు. స్టూడియోలో కూర్చున్న వ్యక్తులు మతం పేరుతో బాబాలు చేసిన మాయలు, మోసాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు.