Mon Nov 25 2024 16:31:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేరళలో ఆర్ఎస్ఎస్ కు చెందిన మహిళపై దాడి చేయలేదు
కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు మద్దతిచ్చినందుకు ఓ మహిళను హత్య చేశారని చెబుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఓ మహిళను కారులో నుంచి బయటకు లాగి కొందరు వ్యక్తులు కాల్చిచంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు మద్దతిచ్చినందుకు ఓ మహిళను హత్య చేశారని చెబుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఓ మహిళను కారులో నుంచి బయటకు లాగి కొందరు వ్యక్తులు కాల్చిచంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీధిలో ఎంతో మంది తిరుగుతూ ఉండగా.. ఈ వీడియో చిత్రీకరించారు. మహిళ పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమెను లాక్కుని వచ్చి, కాల్చడం వీడియోలో రికార్డు అయింది.
"కేరళలో ఒక RSS మహిళా కార్యకర్తను కాల్చి చంపారు... చాలు... ఇది చూడండి" (“In Kerala an RSS Lady worker was shot dead by Ms... enough is enough... check it out”) అని వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://www.facebook.com/100054640448478/videos/259600609971263
https://www.facebook.com/naresh.shenoy1/videos/3279049895667941
https://www.facebook.com/naresh.shenoy1/posts/3279049895667941/
ఆర్ఎస్ఎస్కు చెందిన మహిళా మద్దతుదారుని హత్య చేసినట్లు వైరల్ వీడియోలోని వాదన అవాస్తవం. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ మరణం ఆధారంగా 2017లో ప్రదర్శించిన వీధి నాటకానికి సంబంధించిన వీడియో ఇది.
ఈ వీడియో 2017లో కూడా అదే వాదనతో వైరల్ చేశారు. ఆ తర్వాత ఆ వాదనను ఖండిస్తూ అనేక కథనాలను ప్రచురించారు. వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఆసియానెట్ న్యూస్ ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం, మలప్పురంలోని కాళికావులో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రదర్శించిన వీధి నాటకానికి సంబంధించిన క్లిప్ ను చూడొచ్చు.
https://www.facebook.com/
https://www.facebook.com/
https://www.facebook.com/
ఫ్యాక్ట్ చెకింగ్:
ఆర్ఎస్ఎస్కు చెందిన మహిళా మద్దతుదారుని హత్య చేసినట్లు వైరల్ వీడియోలోని వాదన అవాస్తవం. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ మరణం ఆధారంగా 2017లో ప్రదర్శించిన వీధి నాటకానికి సంబంధించిన వీడియో ఇది.
ఈ వీడియో 2017లో కూడా అదే వాదనతో వైరల్ చేశారు. ఆ తర్వాత ఆ వాదనను ఖండిస్తూ అనేక కథనాలను ప్రచురించారు. వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఆసియానెట్ న్యూస్ ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం, మలప్పురంలోని కాళికావులో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రదర్శించిన వీధి నాటకానికి సంబంధించిన క్లిప్ ను చూడొచ్చు.
సెప్టెంబరు 2017లో జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను ఆమె ఇంటి బయట కాల్చి చంపిన ఘటనపై వీధి నాటకాన్ని చేసి చూపించారు.
News18.com సెప్టెంబర్ 2017లో DYFI నిర్వహించిన వీధి నాటకానికి సంబంధించిన వీడియోకు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేసింది.
వైరల్ వీడియో 2017లో మలప్పురంలో ప్రదర్శించిన వీధి నాటకంలోని క్లిప్. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : RSS lady worker killed in Kerala
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story