ఫ్యాక్ట్ చెక్: ఒక స్క్రిప్టెడ్ వీడియోను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు
చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఉదంతాలు చూస్తూ ఉంటే పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలే ఎక్కువ బాధపడుతున్నారు, ఇబ్బందులు

Claim :
ఓ మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్ రూమ్ లో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడుFact :
అదొక స్క్రిప్టెడ్ వీడియో. నిజమైన ఘటన కాదు
చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఉదంతాలు చూస్తూ ఉంటే పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలే ఎక్కువ బాధపడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనిపిస్తూ ఉంది. చాలామంది బయటకు చెప్పుకోలేక కుమిలి, కుమిలి ఏడుస్తూ ఉన్నారు. వైవాహిక సమస్యల కారణంగా తమ జీవితాలను చాలా మంది అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉన్నారు. NCRB డేటా ప్రకారం పెళ్ళైన జంటలలో మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులే ఆత్మహత్య చేసుకున్నారు. 2022 సంవత్సరంలో 83,713 మంది పెళ్ళైన మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను వదిలేయగా, అదే సమయంలో 30,771 మంది మహిళలు మరణించారు. బెంగళూరు, ఆగ్రా నగరాలకు చెందిన టెకీలు ఇటీవల ఆత్మహత్య చేసుకునే ముందు విడిచిపెట్టిన సూసైడ్ నోట్లు, కేసులు దేశాన్ని కదిలించాయి. మహిళల వేధింపుల నుండి మగవాళ్లను రక్షించడానికి భారతదేశంలో కఠినమైన చట్టాలు ఉండాలనే డిమాండ్ మొదలైంది.
క్లెయిం ఆర్చైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
ముందుగా, వీడియో లో ఉన్న TV1ఇండియా లోగో ను చూసి, ఆ పేరు పైన ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ కోసం వెతకగా, TV1 ఇండియా ఈన్స్తగ్రం హ్యాండిల్ షేర్ చేసిన వీడియో లభించింది. వీడియో నవంబర్ 2, 2024న షేర్ చేయబడింది. ఆ వీడియో పైన వచ్చిన వ్యాఖ్యలను గమనించినప్పుడు, కొంతమంది వినియోగదారులు ఇది స్క్రిప్టెడ్ వీడియో అని రాసినట్టు తెలుసుకున్నాం.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలో కనిపించిన వారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, స్క్రిప్ట్ చేసిన వీడియోలను YouTubeలో ప్రచురిస్తారని తెలుసుకున్నాం. Ankita Karotiya అనే యూట్యూబ్ పేజీలో ఆగస్టు 25, 2024న వీడియోను పోస్టు చేశారు. ‘Ankita Karotiya II @royaltiger02” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
ఇలాంటి స్క్రిప్ట్‌లు ఉన్న ఇతర వీడియోలను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోపై మాకు ఎటువంటి డిస్క్లైమర్ కనిపించనప్పటికీ, ఇతర వీడియోలపై ప్రచురించిన డిస్క్లైమర్ను మేము కనుగొన్నాము.
ఇటీవల, అదే యూట్యూబ్ ఛానెల్లో ప్రచురించిన మరొక వీడియోను తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఒక స్క్రిప్టెడ్ వీడియో అని తేల్చింది. ఆ ఫ్యాక్ట్ చెక్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.