Mon Dec 23 2024 13:50:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బుర్జ్ ఖలీఫా సమీపంలో బార్బీకి సంబంధించిన వైరల్ వీడియో CGI తో రూపొందించారు.. 3D ప్రకటన కాదు
దుబాయ్‌లోని ఐకానిక్ స్కైస్క్రాపర్, బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న పింక్ బాక్స్‌లో స్విమ్సూట్ను ధరించి, ఒక పెద్ద బార్బీ డాల్ నడుస్తున్నట్లు చూపించే వీడియో, ఇది 3D అడ్వర్టైజ్మెంట్ ప్రచారంలో భాగమనే వాదనతో వైరల్ అవుతోంది.
Claim :
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో బార్బీ సినిమాకు సంబంధించిన 3D ప్రకటనను చూపుతుందిFact :
ఈ వీడియో సీజీఐ ద్వారా సృష్టించిన ప్రకటన
వైరల్ వీడియో CGI ద్వారా రూపొందించిన ప్రకటన, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఉంచిన 3D అడ్వర్టైజ్మెంట్ కాదు
దుబాయ్‌లోని ఐకానిక్ స్కైస్క్రాపర్, బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న పింక్ బాక్స్‌లో స్విమ్సూట్ను ధరించి, ఒక పెద్ద బార్బీ డాల్ నడుస్తున్నట్లు చూపించే వీడియో, ఇది 3D అడ్వర్టైజ్మెంట్ ప్రచారంలో భాగమనే వాదనతో వైరల్ అవుతోంది.
వీడియోకు క్యాప్షన్ “3D ad in front of Burj Khalifa” ఇలా ఉంది. నిజంగానే ఇదొక 3డీ యాడ్ అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో హాలీవుడ్ చిత్రం ‘బార్బీ’ కోసం ఐ స్టూడియో రూపొందించిన ప్రకటన. బుర్జ్ ఖలీఫా దగ్గర ఉంచిన 3D ప్రకటన కాదు.
“3D Barbie movie advertisement” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. మేము ఈ విజువల్స్ CGI రూపొందించారని నిర్ధారించే అనేక ఫలితాలను మేము కనుగొన్నాము.
https://www.tiktok.com/@irynaai/video/7259661519292615963
NDTV నివేదిక ప్రకారం, బుర్జ్ ఖలీఫా పక్కన ఉంచిన మాట్టెల్ ప్యాకేజింగ్‌లో ఒక పెద్ద బార్బీ బొమ్మ ఉన్న వీడియో ఐ స్టూడియో రూపొందించిన CGI వీడియో. ఈ వీడియోలో స్ట్రాప్‌లెస్ స్ట్రిప్డ్ జంప్‌సూట్, వైట్ క్యాట్-ఐ సన్ గ్లాసెస్, బ్లాక్ హీల్స్ ధరించి, బార్బీ ప్యాకేజింగ్ నుండి బయటకు వస్తూ కనిపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్ల మందికి పైగా వీక్షించిన వీడియో వైరల్‌గా మారింది.
Eye Studio సంస్థ UAE , KSAలోని ఒక సోషల్ మీడియా ఏజెన్సీ. వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్ CGI యానిమేషన్లు, ఇల్లస్ట్రేషన్స్, వ్యూహాలు, ప్రమోషన్స్.. వంటి వాటిలో ప్రత్యేకత కలిగి ఉంది. జూలై 20న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో కోట్లాది మందికి చేరువైంది.
“3D Barbie movie advertisement” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. మేము ఈ విజువల్స్ CGI రూపొందించారని నిర్ధారించే అనేక ఫలితాలను మేము కనుగొన్నాము.
https://www.tiktok.com/@
NDTV నివేదిక ప్రకారం, బుర్జ్ ఖలీఫా పక్కన ఉంచిన మాట్టెల్ ప్యాకేజింగ్‌లో ఒక పెద్ద బార్బీ బొమ్మ ఉన్న వీడియో ఐ స్టూడియో రూపొందించిన CGI వీడియో. ఈ వీడియోలో స్ట్రాప్‌లెస్ స్ట్రిప్డ్ జంప్‌సూట్, వైట్ క్యాట్-ఐ సన్ గ్లాసెస్, బ్లాక్ హీల్స్ ధరించి, బార్బీ ప్యాకేజింగ్ నుండి బయటకు వస్తూ కనిపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియన్ల మందికి పైగా వీక్షించిన వీడియో వైరల్‌గా మారింది.
Eye Studio సంస్థ UAE , KSAలోని ఒక సోషల్ మీడియా ఏజెన్సీ. వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్ CGI యానిమేషన్లు, ఇల్లస్ట్రేషన్స్, వ్యూహాలు, ప్రమోషన్స్.. వంటి వాటిలో ప్రత్యేకత కలిగి ఉంది. జూలై 20న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో కోట్లాది మందికి చేరువైంది.
ఐ స్టూడియో సంస్థ CGIని ఉపయోగించి ఈ వీడియో రూపొందించారని ఇండియా టుడే కూడా ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బార్బీ విడుదల తేదీ కాస్త ఆలస్యమైంది. చిత్రం మార్కెటింగ్ బృందం హైప్ తగ్గిపోకుండా ఉండేందుకు ఇలా క్రియేటివ్ గా ఆలోచించింది. ఈ ప్రత్యేకమైన ప్రకటనను చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. బార్బీ మార్కెటింగ్ టీమ్‌కు ప్రశంసలు దక్కాయి.
స్కై న్యూస్ కూడా “Giant CGI Barbie spotted next to Dubai's Burj Khalifa” టైటిల్‌తో వీడియోను ప్రచురించింది.
వైరల్ వీడియో హాలీవుడ్ చిత్రం బార్బీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన CGI యాడ్ అని మేము ధృవీకరించాము. నిజంగా సినిమా కోసం ఏర్పాటు చేసిన 3D ప్రకటన కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Video shows 3D advertisement of Barbie movie near Burj Khalifa, Dubai
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story