Mon Nov 25 2024 07:22:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ తన మిత్రుడని చెబుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది
తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీని తన బెస్ట్ ఫ్రెండ్‌గా పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీని తన బెస్ట్ ఫ్రెండ్‌గా పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన కుమార్తె కె. కవిత పేరు రావడంతో కేసీఆర్ మారిపోయారని.. ఆయన మాటలు కూడా మారిపోయాయని పలువురు వినియోగదారులు పేర్కొన్నారు.
ఆయనలో ఎంతో మార్పు వచ్చిందంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు.. ఆయన అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది. మంచి స్నేహితుడు అంటూ కేసీఆర్ మాట్లాడారు.
ఆయనలో ఎంతో మార్పు వచ్చిందంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు.. ఆయన అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది. మంచి స్నేహితుడు అంటూ కేసీఆర్ మాట్లాడారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న దావా ప్రజలను తప్పుదారి పట్టించేది.
మేము YouTubeలో సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. Xplorer India ద్వారా మార్చి 4, 2018 నాటి “I am Modi’s Best Friend” – CM KCR on his relationship with PM Modi అనే శీర్షికతో ప్రధాని నరేంద్ర మోదీతో తన బంధంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కనుగొన్నాము.
"ప్రధాని నరేంద్ర మోదీకి తాము వ్యతిరేకం కాదు.. ఆయనంటే నాకు చాలా గౌరవం…” అని కేసీఆర్ చెబుతున్న వైరల్ క్లిప్‌ను మేము గమనించాము.
Around Telugu అనే వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్ లో కూడా మేము వీడియోను చూశాము. మార్చి 4, 2018న వీడియోను అప్లోడ్ చేశారు. "మోడీ దుమ్ము దులిపిన కేసీఆర్...KCR BEST Press Meet Video...Narendra Modi BJP...Telangana News" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోలో కూడా, తెలంగాణ సీఎం ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. తాను ప్రధాని మోదీకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం వినవచ్చు.
టైమ్స్ ఆఫ్ ఇండియా, మార్చి 4, 2018 నాటి ఒక నివేదికను మేము కనుగొన్నాము. ఆ నివేదికలో “కరీంనగర్, ఆదిలాబాద్‌లలో జరిగిన బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ చేసిన ఆరోపణల తర్వాత, టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఆయన ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి పదాలను ఉపయోగించలేదు." అని అందులో ఉంది.
“నరేంద్ర మోదీ అంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. నేను అతని బెస్ట్ ఫ్రెండ్, మేము మునుపటి సమావేశాలలో చాలా సమస్యలపై మాట్లాడుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను ఆయన ప్రశంసించారు." అని చెప్పుకొచ్చారు.
ఇక కవిత పేరు లిక్కర్ కుంభకోణంలో వినిపించింది 2022 సంవత్సరంలో అనే విషయాన్ని గుర్తించాలి. డిసెంబర్ 2, 2022 నాటి హిందుస్థాన్ టైమ్స్ నివేదికను మేము కనుగొన్నాము, “డిసెంబర్ 6న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) కుమార్తె కె కవిత విచారణకు హాజరు కావాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమన్లు పంపింది." ( “K Kavitha, daughter of Telangana chief minister K Chandrasekhar Rao (KCR), has been summoned by the Central Bureau of Investigation (CBI) to appear for questioning in the Delhi liquor policy case on December 6.”) అని ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న దావా ప్రజలను తప్పుదారి పట్టించేది. ప్రధాని మోదీ తనకు ప్రాణ స్నేహితుడని తెలంగాణ సీఎం చెబుతున్న వీడియో 2018 నాటిదని గుర్తించాం. మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురి పేరు బయటపెట్టిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు.
Claim : Viral claim that KCR called Modi his best friend after his daughter was named in the Delhi liquor policy scam.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story