Tue Nov 05 2024 14:03:37 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో నేపాల్ విమాన ప్రమాదానికి చెందినదా..?
నేపాల్ లో ఇటీవల చోటు చేసుకున్న విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
నేపాల్ లో ఇటీవల చోటు చేసుకున్న విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
యతి ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో జరిగిన తర్వాత.. ఆ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవే అని పేర్కొంటూ చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పలు వీడియోలను పంచుకుంటున్నారు.
ఓ విమానం గాల్లోకి ఎగురుతూ ఉండగా.. ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఆ తర్వాత కూలిపోవడం.. పెద్దగా పొగలు అలుముకోవడం మనం గమనించవచ్చు.
https://archive.ph/EElIe
https://archive.ph/RzHvC
https://archive.ph/EElIe
https://archive.ph/RzHvC
ఫ్యాక్ట్ చెకింగ్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇది నేపాల్ ఘటనకు సంబంధించిన వీడియో కాదని మా బృందం గుర్తించింది.వీడియో నుండి కీలక ఫ్రేమ్ల యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆటో ఎవల్యూషన్ ద్వారా ఆగస్టు 17, 2021 నాటి, ‘ ‘Ilyushin Military Plane Crashes in Russia, the Tragic Moment Was Captured on Camera.’ అనే వీడియోకు సంబంధించిన వివరాలు మాకు దొరికాయి. దీన్ని బట్టి ఇది రష్యాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ వీడియోలో ఉన్న విమానం ఇల్యుషిన్ Il-112V ప్రోటోటైప్ మిలిటరీ ట్రాన్స్పోర్టర్ అని నివేదికలో తెలిపారు. అది రష్యాలోని కుబింకా ఎయిర్ఫీల్డ్ సమీపంలోని అడవిలో కూలిపోయింది. ఈ విమానాన్ని రష్యన్ ఏరోస్పేస్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC) అభివృద్ధి చేస్తోంది. ఆంటోనోవ్ An-26 విమానం స్థానంలో వీటిని తీసుకుని రావాలని రష్యా భావిస్తూ ఉంది.
“ilyushin il-112v,” “crash” & “Russia” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి వీడియోకు సంబంధించిన సమాచారాన్ని చూశాం. ఆగస్టు 17, 2021న CNN-న్యూస్ 18 అధికారిక ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోకు YouTube లో మేము చూశాం. వైరల్ వీడియోకు సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చు. ఆ రోజు ఉదయం మాస్కోలో సైనిక విమానం కూలిపోయిందని నివేదికలో పేర్కొంది. విమానంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారంతా ప్రమాదంలో మరణించారని రష్యా మీడియా పేర్కొంది.

అనేక వార్తా సంస్థలు కూడా ఈ సంఘటనపై నివేదించాయి. విమానం ఇల్యుషిన్ Il-112V ప్రోటోటైప్ మిలిటరీ ట్రాన్స్పోర్టర్ అని ధృవీకరించాయి. దీనిని రష్యన్ ఏరోస్పేస్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC) అభివృద్ధి చేస్తోంది. రష్యాలోని కుబింకా ఎయిర్ఫీల్డ్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఈ సంఘటనలో అందరూ మరణించారు.
https://www.reuters.com/world/
నేపాల్ లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
Claim : Visuals of a plane crash claiming that it is from recent Yeti Airlines plane crash in Nepal.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story