Sun Nov 17 2024 22:14:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారతదేశ జనాభా 140 కోట్ల రూపాయలు అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేది.
భారతదేశ జనాభా 140 కోట్ల రూపాయలు అని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశ జనాభా 140 కోట్ల రూపాయలు అని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతదేశ జనాభా 140 కోట్ల రూపాయలు అన్నట్లు ఉంది. దీన్ని కొందరు ట్రోల్ చేస్తూ పోస్టును షేర్ చేస్తూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
మేము సంబంధిత పదాలతో కీవర్డ్ సెర్చ్ చేసాము. హర్యానాలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర రెండవ దశ సందర్భంగా పానిపట్లో రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీ గురించి అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము.
నివేదికల ప్రకారం, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించారు. "నా మదిలో ఒక ప్రశ్న ఉంది... దేశ జనాభా 140 కోట్లు (1.4 బిలియన్లు) ఉన్నప్పటికీ... దేశంలోని 100 మంది సంపన్నుల దగ్గర ఏకంగా 50% సంపద ఉంది. మొత్తం సంపద వాళ్ళ దగ్గరే ఉండడంలో మీకు ఏమైనా న్యాయం కనిపిస్తోందా? ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉన్న వాస్తవం అని అన్నారు. ఈ నివేదికల్లో డబ్బుతో జనాభాను సూచించే ప్రస్తావన లేదు.
https://thedailyguardian.com/
https://www.hindustantimes.
https://m.timesofindia.com/
దీన్ని సూచనగా ఉపయోగించి, మేము "రాహుల్ గాంధీ పానిపట్ భారత్ జోడో యాత్ర" కోసం కీవర్డ్ శోధనను నిర్వహించాము. ఈ శీర్షికతో జనవరి 6, 2023 నుండి YouTube వీడియోను కనుగొన్నాము:"Rahul Gandhi Full Speech | Panipat | Haryana | Bharat Jodo Yatra," అని భారత జాతీయ కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు.
వీడియోలో 1:56 వద్ద, రాహుల్ గాంధీ భారతదేశ జనాభా 140 కోట్ల రూపాయలు అని చెప్పడం వినవచ్చు, ఆ తర్వాత 140 కోట్ల మంది అని సరిదిద్దుకున్నారు. అయితే, వైరల్ క్లిప్ నుండి ఆయన సరిదిద్దుకున్న వాయిస్ ను వదిలిపెట్టారు.
అందువల్ల, ఈ దావా ప్రజలను తప్పుదారి పట్టించేది. భారతదేశ జనాభా 140 కోట్ల రూపాయలు అని రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించిన క్లిప్డ్ వెర్షన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒరిజినల్ వీడియోలో ఆయన తన తప్పును సరిదిద్దుకున్నారు. కానీ వైరల్ అవుతున్న వీడియోను కేవలం ట్రిమ్ చేసి ట్రోల్ చేయడానికి ఉపయోగించారు.
Claim : A video of Rahul Gandhi’s speech, where he is heard saying India’s population is 140 crore rupees.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story