Mon Dec 23 2024 07:59:26 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆ వీడియో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాకు సంబంధించినది కాదు
షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం పఠాన్ లోనిది అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ ప్రచారంలో ఉంది.
షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం పఠాన్ లోనిది అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ ప్రచారంలో ఉంది.
నటి ప్రియాంక చోప్రా షారుఖ్ ఖాన్ ని జైలు గురించి అడిగినప్పుడు, అతను యూనిఫాం రంగు పట్ల అసంతృప్తిగా ఉన్నానని చెప్పాడు. ఆ వీడియోలో కాషాయానికి వ్యతిరేకంగా ఈ పని చేశారని చెప్పారు. పోస్ట్ ఆఖర్లో పఠాన్ చిత్రాన్ని బహిష్కరించాలాని కోరింది. ఈ వీడియోలోని దృశ్యం షారుక్ ఖాన్ చిత్రం పఠాన్లోనిది అని చెబుతుంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ముందుగా, వైరల్ పోస్ట్ లో ఎంత నిజం ఉందో తెలుసుకోడానికి మేము పఠాన్ ట్రైలర్ను చూశాము. కానీ Facebook వినియోగదారు క్లెయిమ్ చేసినట్లుగా సంబంధిత దృశ్యం ఏదీ కనుగొనబడలేదు. పఠాన్ జనవరి 2023లో విడుదల కానుంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రమ్ ప్రధాన పాత్రలు పోషించారు.
https://www.imdb.com/title/tt12844910/
రెండవది, మేము ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్ ఉన్న సినిమా సన్నివేశాల కోసం సంబంధిత కీలకపదాలతో ఇంటర్నెట్లో సెర్చ్ చేశాం. యూట్యూబ్లో అందుబాటులో ఉన్న డాన్-2 చిత్రం జైలు సన్నివేశాన్ని చూశాము. మేము యూట్యూబ్లో మలేషియాలోని జైలుకు సంబంధించిన మరొక సన్నివేశాన్ని కనుగొన్నాము.
https://m.imdb.com/title/tt1285241/
https://www.imdb.com/title/
రెండవది, మేము ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్ ఉన్న సినిమా సన్నివేశాల కోసం సంబంధిత కీలకపదాలతో ఇంటర్నెట్లో సెర్చ్ చేశాం. యూట్యూబ్లో అందుబాటులో ఉన్న డాన్-2 చిత్రం జైలు సన్నివేశాన్ని చూశాము. మేము యూట్యూబ్లో మలేషియాలోని జైలుకు సంబంధించిన మరొక సన్నివేశాన్ని కనుగొన్నాము.
https://m.imdb.com/title/
మలేషియాలో ఆరెంజ్ కలర్ యూనిఫారాలు ధరించిన ఖైదీల చిత్రాలతో కూడిన కథనాలను మేము కనుగొన్నాము.
https://hype.my/2022/289535/
https://www.dailymail.co.uk/
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. వైరల్ వీడియో క్లిప్ డాన్-2 చిత్రానికి సంబంధించినది. ఇది 2012లో విడుదలైంది. పఠాన్ సినిమా ఇంకా విడుదల కాలేదు.
Claim : The scene shown in the viral video is from Shah Rukh Khan-starrer Pathaan in which Khan says he does not like the colour (saffron) of his jail uniform.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story