Sat Dec 21 2024 08:18:23 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కబడ్డీ ఆడుతూ చెంపదెబ్బలు కొడుతున్న వీడియో భారత్ కు చెందినది కాదు.. పాకిస్థాన్ లోనిది
కబడ్డీ.. సాంప్రదాయ భారతీయ కబడ్డీ 4,000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రీడ. కబడ్డీ అనేది 7 మంది ఆటగాళ్లు.. 3-5 మంది ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో కూడిన క్రీడ.
Claim :
ఈ వీడియో భారతదేశంలో జరిగే ‘చెంపదెబ్బల కబడ్డీ ’ ఆటని చూపుతుందిFact :
ఈ వీడియో పాకిస్థాన్‌లో ఆడే క్రీడ.. ‘తప్పడ్ కబడ్డీ’ అని అంటారు
‘స్లాప్ కబడ్డీ’ అనే క్రీడను చూపించే వీడియో పాకిస్తాన్ కు చెందినది.. అయితే అది భారత్‌కు ఆపాదించారు
కబడ్డీ.. సాంప్రదాయ భారతీయ కబడ్డీ 4,000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రీడ. కబడ్డీ అనేది 7 మంది ఆటగాళ్లు.. 3-5 మంది ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో కూడిన క్రీడ.
ఇద్దరు వ్యక్తుల మధ్య చెంపదెబ్బలు జరుగుతున్నట్లుగా చూపించే ఒక క్రీడ భారతదేశానికి చెందినది అనే వాదనతో సోషల్ మీడియాలో చెలామణిలో ఉంది. వీడియోలో, ఇద్దరు పురుషులు ఒకరినొకరు కొట్టుకోవడం చూడొచ్చు. “NPCలను పక్కన పెట్టండి. ఇండియన్ స్లాప్ ఫైట్లు టిక్‌టాక్‌లో ఉద్భవిస్తున్న కొత్త ట్రెండ్."(“Move aside NPCs. Indian slap fights are a new trend that’s emerging on TikTok.”) అని అందులో చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ స్లాప్ కబడ్డీ పాకిస్థాన్ కు చెందినది.
“Slap Kabaddi India” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. మేము ఇదే వీడియోను పలువురు షేర్ చేసినట్లు గుర్తించాం.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్షాట్లను Wio న్యూస్ మీడియా సంస్థ పంచుకుంది. స్లాప్ కబడ్డీ అనేది పాకిస్తాన్లో ఒక చట్టబద్ధమైన క్రీడ, ఇది సాంప్రదాయ కబడ్డీకి కొన్ని మార్పులు చేసి ఆడుతుంటారు. స్లాప్ కబడ్డీకి.. సాధారణ కబడ్డీకి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే.. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి లేదా తప్పించుకోవడానికి క్రీడాకారులు చెంపదెబ్బల పోటీలలో పాల్గొంటారు. చెంపదెబ్బలతో ఆటగాళ్ళు తమ ప్రత్యర్థులను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కొన్ని సార్లు చిన్నగా.. ఇంకొన్ని సార్లు బలంగా ఈ చెంపదెబ్బలు తగులుతూ ఉంటాయి.
ఇండియా టైమ్స్ షేర్ చేసిన వివరణాత్మక వీడియోలో కూడా స్లాప్ కబడ్డీ పాకిస్థాన్‌కు చెందిన క్రీడ అని వివరించారు. వీడియో వివరణలో “ఇది పాకిస్తాన్లో చట్టబద్ధమైన క్రీడ, దీనిని స్లాప్ కబడ్డీ అంటారు. ఈ ఆటలో చాలా చెంపదెబ్బలు ఉంటాయి. మీరు మీ ప్రత్యర్థిని మీకు కావలసినన్ని సార్లు కొట్టవచ్చు.” అని చెప్పుకొచ్చారు.
ఇండియా టుడే జూలై 6, 2023న తన యూట్యూబ్ ఛానెల్లో వైరల్ వీడియోను కూడా షేర్ చేసింది. వీడియో డిస్క్రిప్షన్ లో “Kabaddi is a beloved sport in India. But have you ever heard of Thappad aka Slap Kabaddi? It is a new version of Kabaddi which is popular in Pakistan. Watch to know all about this new sport.” అని ఉంది. కబడ్డీని భారత్ లో ఎంతగానో ఆదరిస్తారనే సంగతి తెలిసిందే.. అయితే మీకు చెంపదెబ్బల కబడ్డీ గురించి తెలుసా..? ఇది పాకిస్థాన్ లో ఎంతో పాపులర్ అని చెప్పారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కబడ్డీ ఆట ఏడుగురు ఆటగాళ్లతో కూడిన రెండు జట్ల మధ్య ఆడే ఆట. దేశవ్యాప్తంగా బాగా చూస్తారు. అయితే, కబడ్డీ.. పాకిస్తానీ వెర్షన్ చాలా భిన్నంగా ఉంటుంది.
ఈ వెర్షన్ ను "తప్పడ్" లేదా "స్లాప్ కబడ్డీ" అని పిలుస్తారు. ఇక్కడ ట్యాక్లింగ్కు బదులు ఆటగాళ్లు ప్రత్యర్థిని కనికరం లేకుండా కొట్టాలి. స్లాప్ కబడ్డీ అనేది టీమ్ గేమ్ కంటే ఒకరిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రీడ.
ఈ నివేదికలో ఒక పాకిస్థానీ కబడ్డీ ఆటగాడు క్రీడ నియమాలను వివరిస్తూ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
'స్లాప్ కబడ్డీ' క్రీడకు సంబంధించిన వీడియో పాకిస్తాన్ కు చెందినది. భారతదేశానికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.

Claim : The video shows slap fighting that takes place in India.
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story