Mon Dec 23 2024 20:20:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు.. కోచి కి చెందిన సుధాకర్ ప్రభు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన అంత గొప్ప స్టార్ అయినా కూడా ఎంతో సింప్లిసిటీ ఉన్న మనిషి. తాజాగా, నీలిరంగు చొక్కా, నల్లటి షార్ట్‌లో ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Claim :
వైరల్ వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తుపట్టలేని విధంగా, చాలా సాధారణంగా ఉన్నారుFact :
వైరల్ వీడియోలో ఉన్నది రజనీకాంత్ కాదు. ఆయన లాగే ఉండే కేరళ కు చెందిన టీ వ్యాపారి
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన అంత గొప్ప స్టార్ అయినా కూడా ఎంతో సింప్లిసిటీ ఉన్న మనిషి. తాజాగా, నీలిరంగు చొక్కా, నల్లటి షార్ట్‌లో ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి హెయిర్ స్టైల్ కూడా రజనీకాంత్ లానే ఉంది. ఆ వ్యక్తి రోడ్డు మీద ప్రజలతో మాట్లాడటం, వారితో కరచాలనం చేయడం మనం చూడొచ్చు.
ఈ వీడియోలో ఉన్నది రజనీకాంత్ అనే ప్రచారం జరుగుతూ ఉంది.
“Down to earth, The Great Rajnikant ji. #sistylo #viral #rajnikanth” అంటూ వైరల్ చేస్తున్నారు.
“Down to earth, The Great Rajnikant ji. #sistylo #viral #rajnikanth” అంటూ వైరల్ చేస్తున్నారు.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో అంటూ తమిళ భాషలో కూడా పోస్టులు పెట్టారు.
NDTV.com ప్రకారం, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోర్ట్ కొచ్చిలోని పట్టాలం రోడ్లో టీ దుకాణం నడుపుతున్న సుధాకర్ ప్రభు అనే వ్యక్తికి సంబంధించిన వీడియో ఇది. లెజెండరీ నటుడితో పోలిక ఉండడంతో ఇంటర్నెట్లో ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రభు, ఒక షార్ట్- షర్ట్ ధరించి కనిపించాడు. రజనీకాంత్ వ్యవహారశైలిని అనుకరిస్తూ కొంతమంది వ్యక్తులతో మాట్లాడటం చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పోలికతో ఉన్న వ్యక్తి కొచ్చిన్‌కు చెందిన టీ అమ్మే వ్యక్తి.NDTV.com ప్రకారం, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోర్ట్ కొచ్చిలోని పట్టాలం రోడ్లో టీ దుకాణం నడుపుతున్న సుధాకర్ ప్రభు అనే వ్యక్తికి సంబంధించిన వీడియో ఇది. లెజెండరీ నటుడితో పోలిక ఉండడంతో ఇంటర్నెట్లో ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రభు, ఒక షార్ట్- షర్ట్ ధరించి కనిపించాడు. రజనీకాంత్ వ్యవహారశైలిని అనుకరిస్తూ కొంతమంది వ్యక్తులతో మాట్లాడటం చూడొచ్చు.
news 18.com ప్రకారం వైరల్ వీడియోలో రజనీకాంత్ కు ఆ వ్యక్తికి అసాధారణమైన పోలికలు ఉన్నాయని పేర్కొంది. క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు షాక్ అయ్యారు. రజనీకాంత్ లుక్ గురించి కచ్చితమైన సమాచారం లేదు. పోస్ట్ కు సంబంధించిన కామెంట్ల ప్రకారం, ఆ వ్యక్తి కొచ్చిన్‌కు చెందిన టీ అమ్మే వ్యక్తి అని.. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో పోలికలు ఉండడంతో ఆ ప్రాంతంలో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడని తెలుస్తోంది.
wionews ప్రకారం, రజనీకాంత్ పోలికలతో ప్రభు ఉన్నారని మలయాళ నటుడు-దర్శకుడు నాదిర్షా గమనించారు. సినిమా షూటింగ్ కోసం ఫోర్ట్ కొచ్చిలో ఉన్న నాదిర్షా టీ అమ్మే వ్యక్తిని గమనించారు. ప్రభు చిత్రాన్ని షేర్ చేసి.. ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా ఉన్నా టీ షాప్ లో పని చేస్తున్నారని తెలిపారు.
ఆయన ట్వీట్ ను ఇక్కడ మీరు చూడొచ్చు.
వైరల్ వీడియోలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు. కేరళకు చెందిన సుధాకర్ ప్రభుకి సంబంధించినది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral video shows Tamil Superstar Rajinikanth who is unrecognizable, in a very simple attire.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story