Mon Nov 25 2024 05:12:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రైల్వే స్టేషన్లో ప్రయాణీకులపై నీరు ఎగిరి పడుతున్న వైరల్ వీడియో ఇటీవలిది కాదు. తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు
రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణీకులు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన రైలు కారణంగా పట్టాలపై ఉన్న నీళ్లు కాస్తా ఎగిరి వారిపై పడుతున్న వీడియో ముంబైలోని నాలా సోపారా రైల్వే స్టేషన్ కు సంబంధించినదని వైరల్ అవుతోంది.
2017లో వేగంగా వెళ్తున్న రైలు కారణంగా వరద నీరు ప్రయాణికులపైకి ఎగురుతున్న వీడియో ఇటీవలి సంఘటనగా వైరల్ పోస్టులు పెడుతున్నారు.
రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణీకులు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన రైలు కారణంగా పట్టాలపై ఉన్న నీళ్లు కాస్తా ఎగిరి వారిపై పడుతున్న వీడియో ముంబైలోని నాలా సోపారా రైల్వే స్టేషన్ కు సంబంధించినదని వైరల్ అవుతోంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను ఇటీవలి వీడియోగా షేర్ చేస్తున్నారు. 2023లో భారీ వర్షాల సమయంలో దీన్ని చిత్రీకరించారని చెబుతున్నారు.
24 సెకండ్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోకు “Nala sopara train station >>> Imagica water park” అనే క్యాప్షన్ ఇచ్చారు. ముంబై లోని నాలా సోపారా రైల్వే స్టేషన్ కాస్తా వాటర్ పార్క్ లాగా మారిపోయిందని చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ముంబైలోని విరార్‌లోని నాలా సోపారా రైల్వే స్టేషన్లో వరదలు ముంచెత్తుతున్నట్లు వీడియో చూపించినప్పటికీ, ఈ వీడియో మొదటిసారిగా ఐదేళ్ల క్రితం పోస్ట్ చేశారు.
మేము Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించగా.. అందుకు సంబంధించిన వీడియోలు కనిపించాయి. 2017లో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
నిడివి ఎక్కువ ఉన్న వీడియో సెప్టెంబర్ 22, 2017న వైరల్ హాగ్ అనే YouTube ఛానెల్ ద్వారా “Train station Water Ride” అని అప్లోడ్ చేశారు. వీడియో వివరణలో ఆ సమయంలో ప్రయాణికుల అనుభవాలను తెలిపారు: “మేము ముంబై సమీపంలోని నాలా సోపారా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నాము. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ చుట్టూ నీరు చేరింది.. ఆ సమయంలో రైలు వేగంగా వచ్చింది. అక్కడ రైలు వేగాన్ని తగ్గించకపోగా బదులుగా, రైలును వేగంగావెళ్ళిపోయింది. దీంతో ప్లాట్‌ఫాంపై నిలబడిన ప్రజల మీదకు నీళ్లు ఎగరడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ప్రయాణికులపై నీరు పడింది. ” అని ఉంది. ఈ సంఘటన భారతదేశంలోని నాలా సోపారా రైల్వే స్టేషన్లో సెప్టెంబర్ 20, 2017 న జరిగిందని కూడా అందులో తెలిపారు.
ఈ విషయాన్ని క్యూ గా తీసుకొని, మేము వార్తా నివేదికల కోసం మరింత వెతికాం. సెప్టెంబర్ 21, 2017న NDTV ఇండియా ప్రచురించిన ఒక వీడియో నివేదికను కూడా మేము కనుగొన్నాము. సోషల్‌లో వైరల్‌గా మారిన వీడియో అని.. ఒక రైలు వరదనీటిలో ఉన్న రైల్వే స్టేషన్‌ను దాటుతున్న వీడియో అని నివేదిక పేర్కొంది. ముంబై శివార్లలోని నాలా సోపారా స్టేషన్లో చిత్రీకరించారు.
అదే వీడియోను ఔట్లుక్ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో సెప్టెంబర్ 20, 2017న “Train running on waterlogged railway tracks at Nalasopara railway station in Mumbai.” క్యాప్షన్‌తో షేర్ చేసింది. అందులో కూడా ఈ వీడియో నాలాసోపోరాలో చోటు చేసుకున్నదే అని తెలిపారు.

హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. నాలా సోపారా స్టేషన్‌లోని వరద నీటితో నిండిన ట్రాక్‌లపై ట్రైన్ అతి వేగంగా దాటిందని తెలిపారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికులు, స్టేషన్‌లోని వారి భద్రతను ప్రమాదం వాటిల్లిందని పశ్చిమ రైల్వే అధికారులు కనుగొన్నారు. నీటమునిగిన పట్టాలపై జైపూర్ సూపర్‌ఫాస్ట్ రైలు గంటకు 110కి.మీ. స్పీడ్ తో వెళ్ళింది. భారీ వర్షాల కారణంగా అన్ని రైళ్లను తక్కువ వేగంతో నడపాలని హెచ్చరిక జారీ చేసినప్పటికీ ఆ ట్రైన్ లోకో పైలట్ ఓవర్ స్పీడ్ తో రైలును వెళ్లనిచ్చారు. ఈ ఘటన తర్వాత స్టేషన్ మాస్టర్‌తో పాటు రైలు లోకో పైలట్‌ను కూడా సస్పెండ్ చేశారు.
నాలా సోపారా రైల్వే స్టేషన్లో ఇటీవల జరిగిన సంఘటన కాదు. ఇది సెప్టెంబర్ 2017 లో జరిగింది. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

Claim : Recent video of a train speeding on waterlogged railway tracks splashing water onto the commuters.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story