Fri Nov 22 2024 20:03:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇటీవల ఢిల్లీ మెట్రోలో లేడీస్ కోచ్ లో ప్రయాణించినందుకు మహిళా పోలీసులు పలువురిని చితకబాదారు
భారతదేశంలోని పలు నగరాల్లో మెట్రో సేవలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఢిల్లీ మెట్రో అతిపెద్దది. మెట్రో రైళ్లు ఢిల్లీ,
Claim :
ఢిల్లీ మెట్రోలో లేడీస్ కోచ్‌లో ప్రయాణించినందుకు మహిళా పోలీసులు పురుషులను చెంపదెబ్బ కొట్టిన ఘటన ఇటీవలిదిFact :
ఈ వీడియో పాతది. 2010 సంవత్సరానికి చెందినది. ఇది ఇటీవలి ఘటన కాదు.
భారతదేశంలోని పలు నగరాల్లో మెట్రో సేవలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఢిల్లీ మెట్రో అతిపెద్దది. మెట్రో రైళ్లు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాల్లో రద్దీని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. ప్రజలు మెట్రోలలో ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు. మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తాయి. దాదాపు అన్ని మెట్రో రైలు సర్వీసుల్లో మెట్రోలో ప్రయాణించే మహిళల కోసం ప్రత్యేకంగా మహిళల కోచ్‌లు ఉంటాయి. మహిళా ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యం కోసం ఈ చర్యలు తీసుకున్నారు.
DMRC 24x7 హెల్ప్‌లైన్ నంబర్ 155370 ను సంప్రదించడం ద్వారా మహిళల కోచ్‌లలోకి అక్రమంగా లేదా అనధికారికంగా ప్రవేశించే వారి గురించి తెలియజేయమని మహిళా ప్రయాణికులను అధికారులు కోరారు. అన్ని మెట్రో రైళ్లలో మొదటి కోచ్ ప్రత్యేకంగా మహిళా ప్రయాణీకులకు మాత్రమే కేటాయించారని DMRC పునరుద్ఘాటించింది. ఈ రిజర్వ్ చే కోచ్‌లలో ప్రయాణించడం మానుకోవాలని మగవారికి సూచించారు. సంబంధిత మెట్రో అధికారులు అన్ని లైన్లలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించడానికి, మహిళా ప్రయాణికుల భద్రత, సౌకర్యం గురించి తెలుసుకోడానికి ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తూనే ఉంటారు. CISF, మెట్రో రైల్ పోలీసుల సిబ్బందితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమిస్తూ ఉంటారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు.
మెట్రో కోచ్ నుండి బయటకు వస్తున్న పురుషులను మహిళా పోలీసులు చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో మహిళా పోలీసుల ఆకస్మిక తనిఖీని చూపిస్తుంది, ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మెట్రో లేడీస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న పురుషులను పట్టుకున్నారు. లేడీస్ కోచ్ నుండి బయటకు వస్తున్న పురుషులను మహిళా పోలీసులు చెంపదెబ్బ కొట్టడం చూడవచ్చంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
"ఢిల్లీ మెట్రో - మహిళల కోచ్‌లో ఉన్న పురుషులు సరైన ట్రీట్మెంట్ పొందుతున్నారు" అనే వాదనతో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
“ఢిల్లీ మెట్రో లోపల మహిళా కోచ్‌లో ప్రయాణిస్తున్న పురుషులపై చర్యలు!!” అనే శీర్షికతో కూడా వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో నవంబర్ 2010 నాటిది. ఇటీవలిది కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, “#DelhiMetro #CISF On #camera Slapped” అనే శీర్షికతో డిసెంబర్ 29, 2021న YouTubeలో వైరల్ వీడియో షేర్ చేశారని మేము కనుగొన్నాము
అదే వీడియోను రెడ్డిట్ లో “Indian police slapping Men who were traveling in the ladies' coach of the New Delhi's metro” 2019లో పోస్టు చేశారు.
టైమ్స్ నౌ వెబ్సైట్లో ప్రచురించిన ఒక కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. ఢిల్లీ మెట్రోలో ఉన్న పురుషులను మహిళా పోలీసు కొట్టినట్లు చూపించే పాత వీడియో ఆన్లైన్లో మళ్లీ వైరల్ అవుతూ ఉంది. మహిళల కోసం రిజర్వ్ చేసిన కోచ్‌లో దాదాపు 40 మంది పురుషులు బలవంతంగా ప్రవేశించి ఖాళీ చేయడానికి నిరాకరించారు. మెట్రో, CISF అధికారులు బయటకు వెళ్ళమని కోరినప్పటికీ లేడీస్ కోచ్‌లో పురుషులు ఉన్నారని ఫిర్యాదు చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో మెట్రో నుండి బయటకు వస్తున్న పురుషులను గేటు వెలుపల నిలబడి ఉన్న మహిళా పోలీసు చెంపదెబ్బ కొట్టినట్లు కథనం తెలిపింది. ఈ సంఘటన నవంబర్ 2010లో మెట్రో లైన్ 2 (ఝంగీర్పురి నుండి హుడా సిటీ సెంటర్)లో జరిగింది.
మెట్రో లైన్ 2 (జహంగీర్‌పురి నుండి హుడా సిటీ సెంటర్ వరకు) నవంబర్ 2010లో ఈ సంఘటన జరిగింది. రైలు నుండి బయటికి రాగానే అనేక మంది పురుషులను ఒక మహిళా పోలీసు అధికారి చెంపదెబ్బ కొట్టినట్లు చూపిస్తుంది. నివేదికల ప్రకారం, దాదాపు 40 మంది పురుషులు మహిళల కోచ్‌లోకి ప్రవేశించారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది.
వైరల్ వీడియో ఇటీవలిది కాదు, లేడీస్ కోచ్‌లో ప్రయాణించినందుకు మహిళా పోలీసులు పురుషులను చెంపదెబ్బ కొట్టిన పాత వీడియో. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.
Claim : ఢిల్లీ మెట్రోలో లేడీస్ కోచ్‌లో ప్రయాణించినందుకు మహిళా పోలీసులు పురుషులను చెంపదెబ్బ కొట్టిన ఘటన ఇటీవలిది
Claimed By : Twitter user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story