Sat Nov 23 2024 09:08:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: డ్రగ్స్ కు బానిస అయిన యువతిని పోలీసులు చితకబాదలేదు. మానసిక వికలాంగురాలిని మంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
మాదకద్రవ్యాలకు బానిస అవ్వడం యువతరానికి శాపంగా మారుతోంది. మాదకద్రవ్యాల బారిన పడిన ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు
Claim :
బెంగళూరులోని కోరమంగళలో డ్రగ్స్‌కు బానిసైన యువతిని పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది.Fact :
మంగుళూరులోని కద్రిలో పోలీసులు అరెస్టు చేసిన మానసిక వికలాంగ యువతిని వీడియో చూపిస్తుంది. ఆమెకు డ్రగ్స్ లేదని పరీక్షల్లో తేలింది
మాదకద్రవ్యాలకు బానిస అవ్వడం యువతరానికి శాపంగా మారుతోంది. మాదకద్రవ్యాల బారిన పడిన ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. డ్రగ్ అడిక్షన్ అనేక మానసిక, శారీరక రుగ్మతలను కారణమవుతూ ఉంది. భారతదేశంలో చాలా మంది యువకులు మాదకద్రవ్యాల బారిన పడ్డారు. ఇది వారికే కాకుండా వారి కుటుంబాలకు కూడా సమస్యలను కలిగిస్తూ ఉంది.
బెంగళూరులోని కోరమంగళకు చెందిన యువతి డ్రగ్ అడిక్ట్ కాగా.. తల్లిదండ్రులే ఆమెను పోలీసులకు అప్పగించారని.. ఆ యువతి పోలీసులతో దురుసుగా ప్రవర్తించగా.. మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియో వాట్సాప్‌తో సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
“కోరమంగళలో డ్రగ్ అడిక్ట్ కేసు*! మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కన్న కూతుర్ని సరి చేయడం తమ వల్ల కాదని పోలీసులకు స్వయంగా అప్పగించిన తల్లిదండ్రులు.! తల్లిదండ్రులూ .. మీకు ఎన్ని పనులు ఉన్నా .. దయచేసి మీ పిల్లలపై దృష్టి పెట్టండి. ఆధునికత పేరుతో అనేక పోకడలకు పోతున్న యువత పెడదోవపడుతోంది.” అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియోలో కనిపిస్తున్న మహిళ మానసిక వికలాంగురాలు. యువతి మంగళూరులోని కద్రి వీధుల్లో తిరుగుతూ దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము వీడియోకు సంబంధించిన కొన్ని కథనాలను కనుగొన్నాము.
Daijiworld.comలో ప్రచురితమైన కథనం ప్రకారం మంగళూరులోని ఒక పోలీస్ స్టేషన్లో ఆ యువతి పోలీసు సిబ్బందితో ఆమె ప్రవర్తించిన వీడియోను.. ఆమె డ్రగ్ అడిక్ట్ అనే క్యాప్షన్‌తో వైరల్ చేశారు.
ఈ విషయంపై సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పంప్వెల్లోని ఓ మెడికల్ షాపులో ఓ యువతి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు మెసేజ్ వచ్చింది. ఆమెను నార్కోటిక్ టెస్ట్ కోసం తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా ఆమె దూకుడుగా ప్రవర్తించింది. ఆమె డ్రగ్స్ సేవించి ఉంటుందన్న అనుమానం కలిగింది.
అనంతరం మహిళా పోలీసుల సహాయంతో యువతిని నార్కోటిక్ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. అయితే ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
సెప్టెంబర్ 9, 2023న headlinekarnataka.comలో ప్రచురించిన కథనం ప్రకారం. సెప్టెంబర్ 1, 2023న పంప్వెల్లోని మెడికల్ యూనిట్‌కి ఒక యువతి వచ్చి దూకుడుగా ప్రవర్తించింది. ఎక్సైజ్ శాఖ అధికారులపైనా ఆమె దాడి చేసింది. డ్రగ్ అడిక్ట్ గా భావించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే పరీక్ష ఫలితాలు నెగిటివ్‌గా రావడంతో పోలీసులు ఆమె మానసిక వికలాంగురాలు అని స్పష్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.
మంగళూరు సిటీ పోలీసుల ఫేస్ బుక్ పోస్టు కూడా ఆమె డ్రగ్స్ అడిక్ట్ కాదని స్పష్టం చేసింది. ఆ యువతి డ్రగ్స్ మత్తులో లేదని తెలిపారు. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె దూకుడుగా ప్రవర్తించడానికి కారణాలను ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అందువల్ల, మానసిక వికలాంగురాలైన యువతి పోలీసు అధికారుల పట్ల దూకుడుగా ప్రవర్తిస్తున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఆమె డ్రగ్స్ సేవించలేదని పరీక్షలో తేలింది. ఈ ఘటన బెంగళూరులోని కోరమంగళలో కాకుండా మంగళూరులోని కద్రిలో జరిగింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Viral video shows a young woman, a drug addict, from Koramangala, Bengaluru, being dragged away by the police
Claimed By : Facebook and youtube users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : Misleading
Next Story