ఫ్యాక్ట్ చెక్: విశాఖపట్నంలో జనావాసాల్లోకి వచ్చిన దుప్పి వీడియో ను హెచ్ సీయూ కి ఆపాదించి షేర్ చేస్తున్నారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత

Claim :
హెచ్ సీ యూ ప్రాంగణంలో చెట్లను కూల్చేసిన తర్వాత హైదరాబాద్ వీధుల్లో దుప్పి ని వైరల్ వీడియో చూపిస్తోందిFact :
వైరల్ వీడియోకు హైదరాబాద్ కు ఎలాంటి సంబంధం లేదు. విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్లో జరిగింది ఈ ఉదంతం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత హైదరాబాద్లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు కూల్చివేత పనులను ఆపాలని ఆజ్ఞలు జారీ చేశాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు స్పందించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని చర్యలను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.
ఫ్యాక్ట్ చెక్:
తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా ఆవాసాలను కోల్పోయిన జింక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోని ఒక అపార్ట్మెంట్ సమీపంలో కనిపించిందనే వాదనలో నిజం లేదు. ఆ వీడియో హైదరాబాద్ నుండి వచ్చింది కాదు, విశాఖపట్నంలో చోటు చేసుకుంది.