Thu Jan 16 2025 08:59:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న కారులో ఎక్కడానికి బీజేపీ ఎంపీ హేమ మాలిని నిరాకరించిన వీడియో ఇటీవలిది కాదు.
Viral video showing BJP MP Hemamalini refusing to board a small car for campaigning is not recent
Claim :
ఎన్నికల ప్రచారానికి మధుర చేరుకున్న బీజేపీ ఎంపీ హేమమాలిని చిన్న కారులో కూర్చోవడానికి నిరాకరించిన వీడియో వైరల్గా మారింది.Fact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో 2014 సంవత్సరానికి చెందినది.. ఇటీవ
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలతో పాత వీడియోలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
బీజేపీ ఎంపీ హేమమాలిని 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో చిన్న వాహనంలో కూర్చోవడానికి అసలు ఒప్పుకోలేదని.. పెద్ద వాహనం కావాలని డిమాండ్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆమె బీజేపీకి పెద్ద నాయకురాలని, ఆమె చిన్న కారు ఎక్కలేరని వ్యంగ్యంగా ఈ వీడియోను షేర్ చేశారు.
“पार्ट टाइम राजनीति करने वालों का अंदाज़ ऐसा ही होता है। जनप्रतिनिधि हैं लेकिन नखरे अभी भी “फ़िल्मी हीरोइन” वाले ही हैं… “मैं बड़ी गाड़ी में जाऊँगी…कोई रोड शो वग़ैरह नहीं…अगर ज़्यादा किया तो वापस आ जाऊँगी…I have other works to do…”हेमा मालिनी लोकतंत्र का महापर्व चल रहा है मगर ड्रीम गर्ल अलग ही सपने में हैं…उड़न खटोले से नीचे धरती
पर उतर ही नहीं रहीं है #Mathura #LokSabhaElection2024”
“बड़ी खबर: हेलीकॉप्टर से उतरते ही दिलावर खां (धर्मेंद्र) की पत्नी आयशा बेगम उर्फ हेमा मालिनी द्वारा गेंहू काटने जाने के लिए छोटी गाड़ी में बैठने से किया इंकार,फार्च्यूनर गाड़ी में बैठने के लिए अड़ी.. कार्यकर्ता को सीट पीछे करने के लिये भी धमकाया” అంటూ హిందీలో వైరల్ వీడియోను పోస్టు చేశారు. హేమమాలిని ఒక పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలని.. అలాంటి వాళ్లు ఇలాంటి డిమాండ్స్ చేస్తారంటూ పోస్టులు పెడుతున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో పాతది.. ఇటీవలి లోక్సభ ఎన్నికలకు సంబంధించినది కాదు. ఇటీవల మథురలో జరిగిన హేమమాలి పర్యటన, మీటింగ్ కు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు అలాంటి సంఘటనలేమీ కనిపించలేదు.వైరల్ వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ సంఘటన 2014 సంవత్సరంలో జరిగిందని నిర్ధారించే అనేక వార్తా నివేదికలను మేము కనుగొన్నాము. Punjab.abplive.com ప్రకారం.. 1.20 నిమిషాల వీడియోను గమనించవచ్చు. ఈ వీడియో 2014 నాటిది.. ఆమె ఎంపీ కాకముందే చోటు చేసుకున్న ఘటన ఇది.
“Hemamalini MP BJP leader, Karnal mai inke Nakhre” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు అక్టోబర్ 2014లో అప్లోడ్ చేశారు.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత.. హేమమాలిని X (ట్విట్టర్)లో ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చారు. హర్యానాలో రోడ్షోలో సురక్షితంగా ఉండటానికి SUVని కావాలని మాత్రమే కోరానని వివరించారు. హేమ మాలిని వివరణను హిందూస్థాన్ టైమ్స్ వంటి పలు వార్తా వెబ్సైట్లు కూడా ప్రచురించాయి.
బీజేపీ ఎంపీ హేమమాలిని పెద్ద కారు కావాలని కోరిన వీడియో పాతది.. ఈ లోక్సభ ఎన్నికలతో సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది.
Claim : ఎన్నికల ప్రచారానికి మధుర చేరుకున్న బీజేపీ ఎంపీ హేమమాలిని చిన్న కారులో కూర్చోవడానికి నిరాకరించిన వీడియో వైరల్గా మారింది.
Claimed By : X (Twitter) users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story