Mon Dec 23 2024 06:46:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రైతులు కస్టమైజ్ చేసిన ట్రాక్టర్లను నిరసనల్లో ఉపయోగిస్తూ ఉన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న క్యాప్షన్ ను గమనించగా.. రైతుల ముసుగులో ప్రభుత్వం ముందు అనేక అవాస్తవ డిమాండ్లు
Claim :
'ఢిల్లీ చలో' మార్చ్‌లో పాల్గొన్న రైతులు కస్టమైజ్డ్ ట్రాక్టర్లను ఉపయోగించారు.Fact :
ఈ మోడిఫై చేసిన ట్రాక్టర్ల వీడియోకు.. ఢిల్లీలో రైతుల నిరసనలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది టర్కీకి సంబంధించింది.
ఇనుప గ్రిల్స్‌తో మోడిఫికేషన్ చేసిన ట్రాక్టర్‌ను రైతులు ఉపయోగిస్తూ ఉన్నారని పేర్కొంటూ ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. పలువురు సోషల్ మీడియాలో రైతులకు ఖలిస్తానీ సానుభూతిపరులు మద్దతు ఇస్తూ ఉన్నారంటూ పోస్టులు పెడుతున్నారు. రైతులు పోలీసులతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న క్యాప్షన్ ను గమనించగా.. రైతుల ముసుగులో ప్రభుత్వం ముందు అనేక అవాస్తవ డిమాండ్లు పెడుతున్న వ్యక్తులు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పేద రైతులు తమ ట్రాక్టర్లను మోడిఫై చేసుకునే స్థోమతను కలిగి ఉన్నారు.. కానీ ప్రభుత్వం నుండి పెన్షన్లు, ఇతర అంశాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన రాజకీయ ప్రేరేపితమని స్పష్టమవుతోందని పోస్టుల్లో చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ క్లిప్ కు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని.. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అది ఫిబ్రవరి 1 నాటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని తేలింది. ఈ పోస్ట్ ను టర్కిష్ మీడియా అవుట్లెట్ ప్రచురించింది.
మేము ట్రాక్టర్స్ మీద "HATTAT 260G" అని ఉండడం కూడా గుర్తించాం. ఈ సమాచారాన్ని ఉపయోగించి.. ట్రాక్టర్ల ఉత్పత్తిలో పేరు సంపాదించిన టర్కీలోని సెర్కెజ్కోయ్లో ఉన్న హట్టత్ ట్రాక్టర్ అనే కంపెనీ వెబ్సైట్ ను మేము గమనించాం. అదే ట్రాక్టర్ మోడల్ కు.. మోడిఫికేషన్ లేని ట్రాక్టర్ చిత్రాలను, వీడియోలను మేము కనుగొన్నాము. అనేక మంది టర్కిష్ యూట్యూబర్లు ఈ ట్రాక్టర్ మోడల్ కు సంబంధించిన వీడియోలను కూడా అప్లోడ్ చేశారు.
cengizler_tarim_55 అనే అకౌంట్ లో జనవరి 31న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్టు చేశారు. ఎమిర్హాన్ సెంగిజ్ అనే టర్కిష్ వ్యక్తి వీడియోను పోస్టు చేశారని మేము గుర్తించాము.
తదుపరి విచారణలో.. ఈ ఖాతాలో మోడిఫై చేసిన ట్రాక్టర్ మోడల్స్ కు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయని మేము గమనించాము. అదే వినియోగదారు పేరుతో ఉన్న TikTok ఖాతా వైరల్ వీడియోను కూడా షేర్ చేసింది.
నిరసనల సమయంలో రైతులు మోడిఫై చేసిన ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారని.. కొన్ని బారికేడ్లను తొలగించడానికి హైడ్రాలిక్ టూల్స్తోనూ, టియర్ గ్యాస్ షెల్లను ఎదుర్కోవడానికి ఫైర్ రెసిస్టెంట్ ట్రైలర్లను ఉపయోగిస్తున్నారని పలు వార్తా నివేదికలను గమనించాం. మరికొన్ని ఫేక్ వీడియోలు కూడా మేము గమనించాం.
అందుకే, ఈ వీడియోకు.. ఢిల్లీలో రైతుల నిరసనలకు ఎలాంటి సంబంధం లేదు. టర్కీకి సంబంధించిన వీడియో ఇది.
Claim : The video shows customized tractors used by farmers participating in 'Delhi Chalo' march
Claimed By : Facebook user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media users
Fact Check : False
Next Story