Fri Nov 22 2024 19:05:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: డ్రైవర్ లెస్ టాక్సీ సర్వీస్ను చూపుతున్న వైరల్ వీడియో చెన్నైలో ప్రారంభించలేదు
ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీని ప్రారంభించిన మొదటి నగరం USAలోని శాన్ ఫ్రాన్సిస్కో. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని వేమో, జనరల్ మోటార్స్ యాజమాన్యంలోని క్రూజ్ USAలోని కొన్ని నగరాల్లో డబ్బులు చెల్లించి ఇలాంటి రైడ్లను అందిస్తున్నాయి.
Claim :
చెన్నైలో ఇటీవల డ్రైవర్ లెస్ ట్యాక్సీ సర్వీసును మొదలుపెట్టారుFact :
వీడియో చెన్నైకి చెందినది కాదు, అమెరికా లో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలో ప్రయాణం చూపుతోంది
ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీని ప్రారంభించిన మొదటి నగరం USAలోని శాన్ ఫ్రాన్సిస్కో. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని వేమో, జనరల్ మోటార్స్ యాజమాన్యంలోని క్రూజ్ USAలోని కొన్ని నగరాల్లో డబ్బులు చెల్లించి ఇలాంటి రైడ్లను అందిస్తున్నాయి.
ఒక వృద్ధ మహిళ తమిళంలో మాట్లాడుతున్నట్లు, సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ సేవను పొందుతున్నట్లు చూపించే వీడియో చెన్నైలో ప్రారంభించిన డ్రైవర్లెస్ టాక్సీ సేవను చూపుతుందనే వాదనతో ప్రచారం చేస్తున్నారు.
మహిళ ట్యాక్సీ ఎక్కి టాక్సీ రైడ్ను ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్యాక్సీ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ఆమె చెపుతున్నారు. ఈ వీడియోను 'డ్రైవర్లెస్ టాక్సీ సర్వీస్ ప్రపంచంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రారంభమైంది' అనే శీర్షికతో షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతదేశంలోని చెన్నైలో డ్రైవర్లెస్ టాక్సీ సేవను ప్రారంభించలేదు. వీడియో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు సంబంధించినది. డ్రైవర్లెస్ టాక్సీ సర్వీస్ భారతదేశంలో ఇంకా ప్రారంభించలేదు.మేము "డ్రైవర్లెస్ టాక్సీ సర్వీస్, చెన్నై" కోసం సెర్చ్ చేశాం. అటువంటి సేవ ఏదీ ప్రారంభించలేదని, త్వరలో ప్రారంభిస్తారని తెలియజేసే వార్తా నివేదికలు కూడా మాకు కనిపించలేదు.
జాగ్రత్తగా గమనించగా టాక్సీకి 'వేమో' అని పేరు పెట్టినట్లు గుర్తించవచ్చు. వేమో గురించి సెర్చ్ చేయగా.. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి స్వయంప్రతిపత్త రైడ్-హెయిలింగ్ సర్వీస్ అని వెబ్సైట్లో పేర్కొన్నట్లు మేము కనుగొన్నాము. ఈ టాక్సీలు ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో, ఫీనిక్స్ నగరాల్లో పనిచేస్తున్నాయి. లాస్ ఏంజిల్స్, ఆస్టిన్లలో త్వరలో సేవలను అందించనున్నాయి.
వీడియోలో స్టీరింగ్ వీల్ ఎడమ వైపున ఉంది. ఇది అమెరికాలో వాహనాలకు ఉంటుంది. భారతదేశంలో స్టీరింగ్ వీల్ కుడి వైపున ఉంటుంది.
దీని నుండి ఒక సూచన తీసుకొని.. మేము “Driverless taxi in USA + Tamil” అనే కీవర్డ్లను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు.. ఒక నెల క్రితం ASK INFORMATION అనే YouTube ఛానెల్ ప్రచురించిన అసలు వీడియోను మేము కనుగొన్నాము. “Driverless Taxi in the USA | அமெரிக்காவில் டிரைவர் இல்லாத டாக்சி | A driverless taxi in America” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వాదనను Newschecker.in కూడా తోసిపుచ్చింది. Waymo సంస్థకు సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఆ సంస్థ వాహనాలు ఫీనిక్స్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, ఆస్టిన్, టెక్సాస్ లలో మాత్రమే పనిచేస్తాయని ధృవీకరించారు.
కాబట్టి, చెన్నైలో డ్రైవర్లెస్ టాక్సీ సేవలను ప్రారంభించినట్లు వైరల్ వీడియో ద్వారా చెబుతోంది అబద్ధమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినది.
Claim : The viral video shows driverless taxi services launched first time in the world in Chennai recently.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story