Mon Dec 23 2024 02:06:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సూపర్ మార్కెట్ లో బతికి ఉన్న చేపలకు సంబంధించిన వీడియోకు చెన్నై తుఫానుకు ఎటువంటి సంబంధం లేదు
మిచాంగ్ తుఫాను చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. 18,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. చెన్నై నగరం చుట్టూ ఉన్న సహాయ శిబిరాలకు తరలించారు. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర వరదలు వచ్చాయి.
Claim :
చెన్నై సూపర్ మార్కెట్ లోకి నీళ్లు రావడంతో చేపలు బతికిపోయాయిFact :
ఈ వీడియో ఇప్పటిది కాదు.. 2018 సంవత్సరానిది. జార్జియాలోని టిబిలిసిలోని సూపర్ మార్కెట్లో ఆక్వేరియం పగిలిపోవడంతో ట్యాంక్‌లోని చేపలు నేల మీద పడ్డాయి.
మిచాంగ్ తుఫాను చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. 18,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. చెన్నై నగరం చుట్టూ ఉన్న సహాయ శిబిరాలకు తరలించారు. తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర వరదలు వచ్చాయి. చెన్నై విమానాశ్రయం కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. దాదాపు 200 విమానాలపై ప్రభావం చూపింది. పలు ప్రాంతాలలో ప్రజలు చిక్కుకుపోయారు. రైల్వే లైన్లు కూడా నీటిలో మునిగిపోవడంతో పలు రైళ్లను రద్దు చేశారు. పలు లోతట్టు ప్రాంతాలలో 3-4 అడుగుల మేర నీరు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో తుపాను తీరం దాటడంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని అనేక ప్రాంతాలు తుఫాను ముప్పు నుండి బయటకు వచ్చాయి.
తుఫానుకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. సూపర్ మార్కెట్ లోని ఫ్లోర్ మీద చేపలు కదులుతూ ఉండడం మనం ఓ వీడియోలో చూడొచ్చు. ఇది చెన్నై సూపర్ మార్కెట్ కు సంబంధించిన వీడియో అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
“Chennai floods in Supermarket” అంటూ వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో అప్లోడ్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోకు.. చెన్నైకు ఎలాంటి సంబంధం లేదు. 2018 నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక అక్వేరియం పగిలిపోవడంతో అందులో చేపలన్నీ నేల మీద పడిపోయాయి.
మేము వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్‌లను సంగ్రహించి.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. ఆ సెర్చ్ లో ఈ వీడియోకు సంబంధించి.. ఫిబ్రవరి 2018లో ప్రచురించిన కొన్ని YouTube వీడియోలను మేము కనుగొన్నాము.
జార్జియాబోరాట్ అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్టు చేశారు. ‘జార్జియాలోని టిబిలిసిలోని క్యారీఫోర్ సూపర్ మార్కెట్ స్టోర్ ఫ్లోర్లో చేపలు ఎగురుతున్న వైరల్ వీడియో” శీర్షికతో షేర్ చేసింది. సూపర్ మార్కెట్ చైన్ స్టోర్లలో ఒకదానిలో అక్వేరియం బద్ధలైపోవడంతో సూపర్ మార్కెట్ ఉద్యోగులు నేలపై చేపలను పట్టుకున్నారని వీడియో వివరణ తెలిపింది.
georgianborat అనే యూట్యూబ్ ఛానల్ లో ‘Fish swim on Carrefour supermarket hypermarket store floor in Tbilisi, Georgia viral video” అనే టైటిల్ తో వీడియోను మీరు చూడొచ్చు.
upi.com ప్రకారం, జార్జియన్ సూపర్ మార్కెట్ వద్ద అక్వేరియం పగిలిపోయిన తర్వాత చేపలు ఫ్లోర్ మీద పడ్డాయని వీడియోను తీసిన వ్యక్తులు తెలిపారు.

Mirror.co.uk ప్రకారం, అక్వేరియం ఎలా విరిగిపోయింది అనేది అస్పష్టంగా ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలను కొందరు కెమెరాలలో బంధించారు. టిబిలిసిలోని క్యారీఫోర్ బ్రాంచ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ సిబ్బంది వలలను ఉపయోగించి చేపలను పట్టుకోడానికి ప్రయత్నించారు.
వైరల్ వీడియో తమిళనాడులోని చెన్నైలో ఇటీవల వరదల సమయంలో తీసినది కాదు. జార్జియా దేశంలో 2018 లో జరిగిన సంఘటనకు సంబంధించినది. వైరల్ అవుతున్న వాదన తప్పు.
Claim : Viral video shows fish afloat in a supermarket in Chennai due to floods
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story