Mon Dec 23 2024 02:42:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వేల సంఖ్యలో యజ్ఞ కుండాలను చూపించే వైరల్ వీడియో అయోధ్య రామ మందిరానికి సంబంధించినది కాదు.. వారణాసిలోని స్వరవేద్ మహామందిర్ కు సంబంధించింది
అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22, 2024న జరగనుంది. ఈ కార్యక్రమాన్ని రామజన్మభూమి ట్రస్ట్ నిర్వహిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర చీఫ్ మంత్రి యోగి ఆదిత్యనాథ్
Claim :
అయోధ్యలోని రామమందిరం ప్రాంగణంలో 25,000 యజ్ఞ కుండాలను చూపించే వీడియోFact :
వైరల్ వీడియో అయోధ్య రామ మందిరానికి సంబంధించినది కాదు
అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22, 2024న జరగనుంది. ఈ కార్యక్రమాన్ని రామజన్మభూమి ట్రస్ట్ నిర్వహిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర చీఫ్ మంత్రి యోగి ఆదిత్యనాథ్, ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగమవ్వనున్నారు.
అయితే యజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లుగా ఉన్న ప్రాంతంలో వేలకొద్దీ యజ్ఞ కుండాలను చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయోధ్యలో ప్రారంభించబోయే రామమందిరంలో పూజలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందనే వాదనతో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
“इन 25000 हजार हवन कुंडो से होगा "राम मंदिर" का उद्घाटन... जय श्री राम” అంటూ హిందీ స్టేట్మెంట్ తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
“इन 25000 हजार हवन कुंडो से होगा "राम मंदिर" का उद्घाटन... जय श्री राम” అంటూ హిందీ స్టేట్మెంట్ తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. యజ్ఞానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఈ వీడియో వారణాసిలోని స్వర్వేద్ మహామండి ధామ్ కు సంబంధించినది.మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి కీలక ఫ్రేమ్‌లను సెర్చ్ చేశాం.. డిసెంబర్ 16, 2023న అరుణ్ విలేజ్ బాయ్ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్లో ప్రచురించబడిన వీడియోను మేము చూశాం. “स्वर्वेद महामंदिर धाम वाराणसी 25 हजार हवन कुंड | एक साथ सभी को जगाया जाएगा ! swarved maha mandir Dham” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
అనువదించగా “ స్వర్వేద్ మహామందిర్ ధామ్ వారణాసి 25 వేల హవన్ కుండ్. అవన్నీ ఒకేసారి వెలుగుతాయి” అనే అర్థం వచ్చింది. టైటిల్ ను బట్టి స్వర్వేద్ మహామందిర్ ధామ్ కు సంబంధించిన వీడియో అని మేము గుర్తించాం.
బనారసి ఆకాష్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన మరో వీడియో కూడా వారణాసిలోని స్వర్వేద్ మహా మందిర్ ధామ్‌లో 25000 యజ్ఞ కుండాలను చూపిస్తుంది. హిందీలో “25000 కుండాలలో మహాయజ్ఞం ఈరోజు ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ రానున్నారు. స్వర్వేద్ మహా మందిర్ వారణాసి” అనే అర్థం వచ్చేలా టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
“25000 havan kund swarved mahamandir dham varanasi” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లోని యజ్ఞ కుండాలలో హోమం నిర్వహిస్తున్నట్లు ప్రచురించిన కొన్ని వీడియోలను మేము కనుగొన్నాము.
వారణాసిలోని ఉమరహా ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ఏడు అంతస్తుల ఆలయమైన స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Timesofindia.comలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, స్వర్వేద మహామందిర్ దేశంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా పరిగణించనున్నారు. మహామందిర్ కాంప్లెక్స్‌లో 100 అడుగుల ఎత్తైన సద్ గురుదేవ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మే 2017లో, స్వర్వేద మహామందిర్ ధామ్‌లో 21,000 కుండాలతో స్వర్వేద అనంతర జ్ఞాన మహాయజ్ఞం జరిగింది.
అందువల్ల, యజ్ఞ కుండాలను చూపించే వైరల్ వీడియో అయోధ్యకు సంబంధించినది కాదు, వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కు సంబంధించినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Viral video shows 25,000 havan kunds in the Ram Mandir in Ayodhya
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story