Sat Nov 23 2024 05:26:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసురుతున్న వీడియో ఏపీ కీ సంబంధించింది కాదు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అలాగే సీట్ల పంపకంపై పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందులో భాగంగానే కొందరికి టిక్కెట్లు జారీ చేయడంతో.. ఇంకొందరు అభ్యర్థులు అసంతృప్తికి గురయ్యారు
Claim :
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ‘ఆత్మీయ సమ్మేళనం’ లో జరిగిన గొడవ వీడియో లో చూడొచ్చుFact :
ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేని వీడియో ఇది. కాంచీపురంలో న్యూస్18 ఛానల్ తమిళనాడులో నిర్వహించిన ‘మక్కల్ సభై’ చర్చలో జరిగిన సంఘటన ఇది
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అలాగే సీట్ల పంపకంపై పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందులో భాగంగానే కొందరికి టిక్కెట్లు జారీ చేయడంతో.. ఇంకొందరు అభ్యర్థులు అసంతృప్తికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో గొడవలు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన టీడీపీ-జనసేన సమావేశానికి సంబంధించిన విజువల్స్ అంటూ.. బహిరంగ సభ సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. కొంతమంది వినియోగదారులు దీనిని విజయవాడలో జరిగిన సభగా చెబుతూ ఉండగా.. మరికొందరు ధర్మవరంలో జరిగిన ‘ఆత్మీయ సమ్మేళనం’ సభ అని అంటున్నారు. ” TDP+ BJP+ JSP విజయవాడ ఆత్మీయ సమావేశం లో కుర్చీలతో ముష్టి యుద్ధం చేసుకుంటున్న కార్యకర్తలు..... అది.. అలా...కలిసిమెలిసి కొట్టుకుంటూ ఉండాలి... #EndOfTDP #EndOfJSP #EndOfBJP” అంటూ ట్వీట్స్ పెడుతూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు సమక్షంలోనే టీడీపీ, బీజేపీ సభ్యులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని గొడవ పడ్డారని మరికొందరు యూజర్లు చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనం’ సమావేశాల దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనం’ సమావేశాలకు సంబంధించిన వార్తలు, విజువల్స్ కోసం తెలుగుపోస్ట్ బృందం వెతికింది. పలు ప్రాంతాలలో జరిగిన సమావేశాల నివేదికలు మాకు లభించాయి. ఈ సమావేశాల్లో విజయవాడ నగరంలో గానీ, ధర్మవరంలో గానీ ఎలాంటి గొడవలు జరిగినట్లు సమాచారం లేదు.విజయవాడ ఆత్మీయ సమ్మేళనం వీడియోను ఇక్కడ చూడవచ్చు
ధర్మవరం సమావేశానికి సంబంధించిన నివేదికను ఇక్కడ చూడవచ్చు:
వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకున్నాం. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించగా.. కుర్చీలను విసురుకోవచ్చా అనే అర్థం వచ్చేలా.. తమిళంలోని టైటిల్‌తో UUUfacts అనే ఛానల్ లో YouTubeలో ప్రచురించిన అదే వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో ఏప్రిల్ 7, 2024న అప్లోడ్ చేశారు.
న్యూస్ 18 తమిళనాడు లైవ్ స్ట్రీమ్ వీడియోలో మేము గొడవకు సంబంధించిన విజువల్స్ ను కనుగొనలేకపోయినప్పటికీ.. మేము వేదికకు సంబంధించిన విజువల్స్‌ను పోల్చి చూశాం. ఆ వీడియో కాంచీపురంలో జరిగిన న్యూస్ 18 “మక్కల్ సభై” మీటింగ్‌లోని వీడియో అని ధృవీకరించాము.
ఈ దృశ్యాలను స్థానిక నాయకుడు, డాక్టర్ ఎస్జి సూర్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. రెండింటిని పోల్చి చూశాం.
వీడియోను మనం నిశితంగా పరిశీలించగా.. ‘News 18’ అని ఉండడాన్ని మనం చూడొచ్చు. అలాగే తమిళ భాషలో స్టేజీ మీద బ్యానర్లను కూడా మనం చూడొచ్చు. తదుపరి శోధనలో.. న్యూస్ 18 తమిళనాడు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో “మక్కల్ సభై” పేరుతో ఎన్నికలకు సంబంధించిన చర్చలను నిర్వహిస్తున్నట్లు మేము కనుగొన్నాము. న్యూస్ 18 తమిళనాడు ఏప్రిల్ 6, 2024న కాంచీపురంలో మక్కల్ సభను నిర్వహించింది. “LIVE: Makkal Sabai | மக்களவை தேர்தல் களம் 2024 - இறுதிச்சுற்றில் முந்தப் போவது யார் ?” అనే టైటిల్ తో వీడియోను లైవ్ స్ట్రీమ్ చేసింది.
ఈ దృశ్యాలను స్థానిక నాయకుడు, డాక్టర్ ఎస్జి సూర్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. రెండింటిని పోల్చి చూశాం.
Thecommunemag.com అనే వెబ్సైట్లో ప్రచురించబడిన ఒక నివేదికలో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఉంది. న్యూస్18 తమిళనాడు ఏప్రిల్ 6, 2024న కాంచీపురంలోని ఉమా మురుగన్ మహల్లో “మక్కల్ సభై” అనే లైవ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక్కడ డీఎంకే నుండి ఎమ్మెల్యే ఎహిలరాసన్, బీజేపీ నుంచి ఎస్జీ సూర్య, సీపీఎం నుంచి భారతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రిపోర్టర్ బాలవేల్ చక్రవర్తి హోస్ట్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా డీఎంకే, బీజేపీ మద్దతుదారుల మధ్య నేతలు వాగ్వాదానికి దిగడంతో ఆ హాల్ లో గొడవ మొదలైంది. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం జరిగింది. ఇవన్నీ వీడియోలో గమనించవచ్చు.
ఈ ఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడు ఎస్జి సూర్య చేసిన ట్వీట్‌ను మేము గుర్తించాం. కాంచీపురంలో జరిగిన కార్యక్రమంలో డీఎంకే కార్యకర్తలు.. బీజేపీ సభ్యులపై దాడి చేశారని అందులో ఆరోపించారు. కుర్చీలు విసరడమే కాకుండా.. అసభ్య పదాలను కూడా ఉపయోగించారని ట్వీట్ లో ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడు ఎస్జి సూర్య చేసిన ట్వీట్‌ను మేము గుర్తించాం. కాంచీపురంలో జరిగిన కార్యక్రమంలో డీఎంకే కార్యకర్తలు.. బీజేపీ సభ్యులపై దాడి చేశారని అందులో ఆరోపించారు. కుర్చీలు విసరడమే కాకుండా.. అసభ్య పదాలను కూడా ఉపయోగించారని ట్వీట్ లో ఆరోపించారు.
ఈ వీడియోలలో నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్లను పోల్చి చూద్దాం.
కాబట్టి, వైరల్ వీడియోలో తమిళనాడులోని కాంచీపురంలో డీఎంకే, బీజేపీ మద్దతుదారుల మధ్య న్యూస్ 18 తమిళనాడు నిర్వహించిన లైవ్ డిబేట్ లో జరిగిన గొడవ. ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మీయ సమ్మేళనం సమావేశాల సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుదారుల మధ్య గొడవ కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ‘ఆత్మీయ సమ్మేళనం’ లో జరిగిన గొడవ వీడియో లో చూడొచ్చు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story