ఫ్యాక్ట్ చెక్: రైలులో నీరు లీక్ అవుతున్నట్లుగా చూపించే వైరల్ వీడియో వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించినది కాదు
భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. గుజరాత్, ఇతర రాష్ట్రాలలో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతకు గురయ్యాయి.
Claim :
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో నుండి నీరు లీక్ అవుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుందిFact :
నీళ్లు లీక్ అవుతున్న రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ కాదు, అది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్
భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. గుజరాత్, ఇతర రాష్ట్రాలలో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. ఢిల్లీలో విమానాశ్రయంలోని టెర్మినల్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షంతో వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
‘Rain Water Leaks in 3 AC Garib Rath train. Train no. 12215/12216’ అనే టైటిల్ తో జూన్ 29, 2024న Zee Business కు సంబంధించిన YouTube ఛానెల్ లో వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. “एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें एक ट्रेन में बारिश का पानी झरने की तरह गिरता दिखाई दे रहा है. लोग सोशल मीडिया पर इस घटना को लेकर शिकायत कर रहे हैं. यह घटना गरीब रथ ट्रेन नंबर 12215/12216 में घटी है. यह ट्रेन 3 एसी क्लास की है.” అనే వివరణ వీడియోకు ఇచ్చారు.
పశ్చిమ రైల్వే అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో వందే భారత్ రైలుకు సంబంధించి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. వదంతులను ఖండించారు. అజ్మీర్ - ఫల్నా స్టేషన్ల మధ్య రైలు నంబర్ 12215, బాంద్రా టెర్మినస్ - ఢిల్లీ సరాయ్ రోహిల్లా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కోచ్ G-12లో నీటి లీకేజీ ఉందని తేలింది. ఫల్నాకు ముందే రైలును నిలిపివేసి, నీటి లీకేజీ సమస్యను సరిచేసినట్లు రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు.