Mon Nov 18 2024 07:31:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓ మహిళ అయోధ్యలోని విరాళాల పెట్టె లోకి నోట్ల కట్టలను వేసేసింది
రామ్ లల్లాకు ప్రార్థనలు చేసేందుకు అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇక ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ Easemytrip పట్టణంలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్ను కూడా ప్రకటించింది.
Claim :
అయోధ్యలోని హుండీలోకి బ్యాగ్ నుండి తీస్తూ డబ్బులను మహిళ విరాళంగా ఇచ్చేసిందని ఆ వీడియో చూపుతుందిFact :
వీడియో పాతది.. సెప్టెంబర్ 2023లో రాజస్థాన్లోని సన్వారియా సేథ్ ఆలయంలో ఇచ్చిన విరాళాలకు సంబంధించినది.
రామ్ లల్లాకు ప్రార్థనలు చేసేందుకు అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇక ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ Easemytrip పట్టణంలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్ను కూడా ప్రకటించింది. ఇలా అటు భక్తులతో అయోధ్య రామ మందిరం కిటకిటలాడుతూ ఉండగా.. మరో వైపు అయోధ్యలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను మొదలుపెట్టబోతూ ఉన్నారు.
ఇదిలా ఉండగా, అయోధ్య రామ మందిరంలో ఓ మహిళా భక్తురాలు భారీగా విరాళం అందజేసిందంటూ.. ఆలయ విరాళాల పెట్టెలో నోట్ల కట్టలను వేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. 2023 సంవత్సరంలో నుండే ఈ వీడియో ఆన్ లైన్ లో ఉంది. రాజస్థాన్లోని ఒక ఆలయానికి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన వీడియో ఇది.
మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను సెర్చ్ చేసినప్పుడు.. ఈ వీడియో సెప్టెంబర్ 2023లో “జై శ్రీ సావలియా సేథ్” (Jay Shri Sawaliya Seth) అనే శీర్షికతో సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
“A woman deposited 10 lakh rupees in the treasury of Savaliya Seth” అనే టైటిల్ తో మరొక ఇంస్టాగ్రామ్ యూజర్ కూడా వీడియోను షేర్ చేశాడు. అందులో పది లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారని తెలిపారు.
Asianetnews.com ప్రకారం, రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలో ఉన్న సన్వాలియా సేథ్ ఆలయంలో వీడియో రికార్డు చేశారు. అక్కడ ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి సన్వాలియా సేథ్ విరాళాల పెట్టెలో 500 రూపాయల నోట్ల కట్టలను వేశారు. ఆమె ఇచ్చిన విరాళం దాదాపు 10 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఈ విరాళాన్ని సెప్టెంబర్ 2023లో కృష్ణాష్టమి రోజున ఇచ్చారని కూడా నివేదిక పేర్కొంది.
మరింతగా వెతికినప్పుడు.. శ్రీకృష్ణుని సన్వారియా సేథ్ జీ మందిరం చిత్తోర్గఢ్-ఉదయ్పూర్ హైవేపై ఉంటుంది. చిత్తోర్గఢ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సన్వారియా సేథ్ జీ మందిర్ను సన్వాలియా జీ మందిర్ అని కూడా అంటారు.
ఒక మహిళ ఆలయంలోని విరాళాల పెట్టెలోకి డబ్బు కట్టలను వేస్తున్న వైరల్ వీడియో అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించినది కాదు. రాజస్థాన్లోని సన్వాలియా సేథ్ ఆలయంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించినది.
Claim : Viral video shows woman dropping a bag full of money into the donation box at Ayodhya temple
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story