Thu Dec 26 2024 15:15:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్న మహిళ జ్యోతిక బసు కాదు, ఆమె సాగరిక అఖ్తర్.
బంగ్లాదేశ్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థి నిరసనకారులు
Claim :
వీడియోలో కనిపిస్తున్న మహిళ జ్యోతిక బసు. బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థిFact :
వీడియోలోని మహిళ సాగరిక అఖ్తర్, ఈడెన్ ఉమెన్స్ కాలేజీలో ముస్లిం ఛాత్ర లీగ్ నాయకురాలు
బంగ్లాదేశ్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థి నిరసనకారులు సుప్రీంకోర్టు సమీపంలో వీధుల్లోకి వచ్చారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశంలోని వందలాది మంది హిందువులపై జరిగిన దాడులకు, దేవాలయాల ధ్వంసానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు.
ఇంతలో, ఒక మహిళను నడిరోడ్డులో శిక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ వీడియోలో ఉన్న హిందూ మహిళ జ్యోతికా బసు ఛటర్జీ అని.. ఆమె సామాజిక కార్యకర్త అంటూ చెప్పారు. ప్రజలకు మంచి చేసే గుణం ఉన్న జ్యోతికా బసును ఘోరంగా హింసించారంటూ సోషల్ మీడియా పోస్టుల్లో తెలిపారు.
వీడియోతో పాటు షేర్ చేసిన క్యాప్షన్‌లో ‘#AHorrorStory' అని చెప్పారు. 'ఈ వీడియోలో ఉన్నది బంగ్లాదేశ్‌కు చెందిన జ్యోతికా బసు ఛటర్జీ. మానవతావాద సంస్థను నడిపిన మహిళ. హిందూ నిధులతో ముస్లింలకు విద్య, ఆరోగ్యంపై ఆమె అవిశ్రాంతంగా కృషి చేశారు. తనకు తెలిసిన మహిళలందరికీ సహాయం చేసింది. ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు జ్యోతిక నంబర్ అందరి నోళ్లలో నానింది. కానీ అల్లర్లు ప్రారంభమైన వెంటనే, ఇస్లామిక్ సమాజం ప్రతిదీ మర్చిపోయింది. ఇరవై మంది వ్యక్తులు ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేశారు. తర్వాత మతపరమైన నినాదాలు చేస్తూ ఆమెను సజీవ దహనం చేశారు.జ్యోతిక సోదరుడు భారత ప్రభుత్వం నుండి సహాయం కోరుతూ ఒక వీడియోను రూపొందించాడు. తర్వాత, అతన్ని కూడా సజీవ దహనం చేశారు!’ అంటూ పోస్టుల్లో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న మహిళ జ్యోతికా బసు కాదు. మేము వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి సెర్చ్ చేయగా, ఆమె సాగరిక అఖ్తర్ అని పేర్కొంటూ కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము.
వైరల్ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, బంగ్లాదేశీ ఫాక్ట్ చెకర్ అయిన ఒక X వినియోగదారు, మరొక X పోస్ట్ నుండి స్క్రీన్షాట్లను పంచుకున్నారు. 'ఆమె సాగరిక అఖ్తర్, ఈడెన్ ఉమెన్స్ కాలేజీకి చెందిన ఒక మహిళా ఛత్ర లీగ్ నాయకురాలు. ఈ వీడియోలోని సంఘటన జూలై 17 నాటిది. మీ కల్పిత కథలో పేర్కొన్నట్లుగా ఆమె జ్యోతిక బసు కాదు. తన అధికారాన్ని ఉపయోగించి విద్యార్థులను హింసించినందుకు ఆమెకు శిక్ష విధించారు. RW ప్రచార హ్యాండిల్స్ బంగ్లాదేశ్ వ్యతిరేక మత ప్రచారాన్ని వ్యాప్తి చేయడం కొనసాగిస్తున్నాయి.' అంటూ అందులో చెప్పుకొచ్చారు.
మరో X వినియోగదారు ‘ఫేక్ న్యూస్ అలర్ట్’ అని వీడియోను పోస్ట్ చేశారు. ఆమె సాగరిక అఖ్తర్, ఈడెన్ ఉమెన్స్ కాలేజీకి చెందిన మహిళా ఛత్ర లీగ్ నాయకురాలు. ఈ వీడియో, సంఘటన జూలై 17 నాటిది. మీ కల్పిత కథలో పేర్కొన్నట్లుగా ఆమె జ్యోతిక బసు కాదు. విద్యార్థులకు వ్యతిరేకంగా కొన్ని చర్యలకు పాల్పడినందుకు ఆమెకు శిక్ష పడిందని తెలిపారు.
ఈ పోస్ట్‌ల నుండి క్యూ తీసుకొని, మేము అసలైన ఫేస్బుక్ పోస్ట్ కోసం సెర్చ్ చేశాం. జూలై 17, 2024న మహదీ హసన్ తల్హా షేర్ చేసిన పోస్ట్‌ని మేము కనుగొన్నాము. ఇందులో ఈడెన్ ఉమెన్స్ కాలేజ్ ఛత్రా లీగ్ నాయకురాలు సాగరికా అఖ్తర్ తప్పించుకోవాలనుకుంటున్నారు, కానీ విద్యార్థులు ఆమెను పట్టుకుని గుంజీలు తీయించారని తెలిపారు. విద్యార్థులను వేధించినందుకే ఆమెతో గుంజీలు తీయించారని తెలుస్తోంది.
అందువల్ల, వైరల్ వీడియోలో ఉన్నది బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ మహిళ జ్యోతికా బసు ఛటర్జీది కాదు, ఈ వీడియో ముస్లిం విద్యార్థి నాయకురాలు సాగరిక అఖ్తర్ ను చూపుతుంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వీడియోలో కనిపిస్తున్న మహిళ జ్యోతిక బసు. బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థి
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story