వైరల్ వీడియో ను నేషనల్ జియోగ్రాఫిక్ చిత్రీకరించలేదు, తీసింది తిరుమల నిజ ఆలయంలో కాదు
తిరుమల, తిరుపతి, చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాన్ని, వేంకటేశ్వర స్వామిని పూజా విధానాన్ని వివరంగా చూపుతున్న ఒక వీడియో, తప్పుడు కధనం తో ఇంటర్నెట్లో వైరల్‌గా షేర్ చేయబడుతోంది.
తిరుమల, తిరుపతి, చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాన్ని, వేంకటేశ్వర స్వామిని పూజా విధానాన్ని వివరంగా చూపుతున్న ఒక వీడియో, తప్పుడు కధనం తో ఇంటర్నెట్లో వైరల్‌గా షేర్ చేయబడుతోంది.
ఈ వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ ద్వారా అసలు తిరుమల ఆలయంలో వీడియో చిత్రీకరించబడిందని, ఇదంతా కేంద్ర ప్రభుత్వ అనుమతితో జరిగిందని క్లెయిమ్ చేస్తున్నారు.
ఆ క్లెయిమ్ "ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి తిరుమలలో వేంకటేశ్వర స్వామి. కేంద్ర ప్రభుత్వ అనుమతితో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఈ వీడియోను చిత్రీకరించింది. దర్శనాన్ని కోల్పోకండి" అంటూ పంచుకోబడుతోంది. ఈ క్లెయిమ్ సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలో ఉంది.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపుతుందని, నేషనల్ జియోగ్రాఫిక్ వారు చిత్రీకరించారనే వాదన అబద్దం.
వీడియో నుంచి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, movies.woxikon.co.nz అనే వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియోలో "శ్రీవారి సేవలు, అభిషేకం-శుక్రవారం ఈ 02-06-17" అనే శీర్షికతో మేము ఇలాంటి విజువల్స్‌ని కనుగొన్నాము. ఈ వీడియోలో SVBC వాటర్‌మార్క్‌తో శుక్రవారాల్లో దేవుడికి చేసే అభిషేకం ఆచారాన్ని చూపుతుంది.
https://movies.woxikon.co.nz/sreevari-sevalu/Z4-oT9zPgRU
వీడియో కింది భాగంలో 'యూట్యూబ్‌లో చూడండి' బటన్ కూడా ఉంది, నొక్కినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిక ఛానెల్ అయిన SVBC TTD యూట్యూబ్ వీడియోని పొందాము.
తిరుమల దెవస్థానాన్ని టిటిడి నిర్వహిస్తోంది.
Tirumala Tirupati Devasthanams (Official Website)
తిరుమల ఆలయంలో షూటింగ్ నిషిద్ధం కాబట్టి షూటింగ్ నిమిత్తం టీటీడీ వారు ఆలయ ప్రతిరూపాన్ని రూపొందించారు. ఆ ఆలయమే వీడియోలో చూపిన ఆలయం. ఆ ఆలయ చిత్రాల్ని ఈ లింక్ లో చూడొచ్చు.
https://in.worldorgs.com/catalog/tirupati/amusement-center/ttd-namoona-alayam
నేషనల్ జియోగ్రాఫిక్ తీసిన డాక్యుమెంటరీ 'ఇన్సైడ్ తిరుమల తిరుపతి' మార్చి 2017లో ప్రదర్శించబడింది. అందులోని కొన్ని షాట్లను పంచుకునే కథనం ఇక్కడ ఉంది.
అందువల్ల, వైరల్ వీడియో తిరుమల ఆలయాన్ని చూపుతుందని, అది కూడా నేషనల్ జియోగ్రాఫిక్ ద్వారా చిత్రీకరించబడింది అనే వాదన అబద్దం.