Mon Dec 23 2024 20:05:58 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కెమెరాలో వింత జీవి కదలికలు రికార్డు అవ్వలేదు.. అదొక Vfx వీడియో
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తొందరగా వైరల్ అయ్యే అంశాలలో దెయ్యాలు కూడా ఒకటి. అదిగో దెయ్యం అంటూ పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెల్లటి వ్యాన్‌పై ఓ జీవి తేలుతున్నట్లు ఓ వ్యక్తి రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, జీవికి కళ్ళు మెరుస్తున్నట్లు అనిపిస్తుంది. అది వ్యాన్ పై నుండి కిందకు దిగుతున్నట్లు కనిపిస్తుంది. ఏడ్చే జంతువును పోలిన వింత శబ్దం వీడియోలో ఉంది. ఈ జీవి ఒక మంత్రగత్తె అని.. బీహార్, మీరట్‌లోని శ్మశానవాటిక సమీపంలో కెమెరాలో రికార్డు చేశారని పలువురు పేర్కొన్నారు.
గత రాత్రి మీరట్‌లో, ఒక మిస్టరీ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. ఒక యువకుడు తన మొబైల్లో దెయ్యం వీడియోను బంధించాడు. మీరట్‌లోని కసంపూర్ గేట్ సమీపంలోని స్మశానవాటిక సమీపంలో నిర్మించిన కాలనీకి సమీపంలో ఈ వీడియో తీశారని పలువురు పోస్టులు పెట్టారు.

జీ న్యూస్ వంటి కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వీడియోపై కథనాలను ప్రసారం చేశాయి. ఆ కథనంలో కల్నాలో కొంతమంది దెయ్యం కనిపించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా, కల్నా నగరంలో నిజంగా దెయ్యాలు కనిపించాయని పుకారు ఉంది! ఆ దెయ్యం వీడియోలో బంధించబడింది. ఫలితంగా, రాత్రి 9 గంటల తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు కూడా రావడంలేదని తెలిపారు
ఫ్యాక్ట్ చెకింగ్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇదే వీడియోని వేర్వేరు ప్రాంతాలలో చోటు చేసుకుందని చెప్పడాన్ని మేము గుర్తించాం.కరాచీ కిడ్నీ హిల్ పార్క్ సమీపంలోని వాష్‌రూమ్ కిటికీ నుండి అర్ధరాత్రి KMC సిటీ వార్డెన్ ఈ వీడియోను చిత్రీకరించాడని పేర్కొంటూ మీడియా ఛానెల్ "జబర్ న్యూస్" యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేయబడింది. అదే విధంగా మలేషియా, ఫిలిప్పీన్స్‌లకు వీడియో జియోట్యాగ్ చేశారు.
https://luminews.my/ms/news/858333
https://attracttour.com/2022/10/actual-footage-a-video-of-an-aswang-evil-creature-in-siquijor-has-gone-viral-on-social-media/
మరొక రివర్స్ ఇమేజ్ సెర్చ్.. సెప్టెంబర్ 24న పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోకి దారితీసింది, "VFX ట్యుటోరియల్. గాల్లో ఎగురుతున్న మంత్రగత్తె కెమెరాలో చిక్కుకుంది."("VFX tutorial. Flying witch caught on camera. Cinema 4d and after effects.") విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వీడియో ఎలా తయారు చేశారో చూపించారు. జాంబియాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ జోసెఫ్ న్జోవు, ఈ వీడియో నిజ జీవితంలో జరిగిన సంఘటనగా ఎలా తీయబడిందో వివరించారు.
3D కళాకారులు ఉపయోగించే సాఫ్ట్వేర్, మార్వెలస్ డిజైనర్‌ని ఉపయోగించి న్జోవు క్లిప్‌ను ఎలా ఎడిట్ చేస్తారో వీడియో చూపిస్తుంది. అతను ఎఫెక్ట్‌ను జోడించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో తన వాయిస్‌ని, అతని భార్య వాయిస్‌ని ఉపయోగించాడని కూడా తెలిపాడు. కానీ వైరల్ వీడియోలో ఆడియో తారుమారు చేశారు.. భయపెట్టే విధంగా భిన్నమైన భయానక శబ్దం ప్లే చేయించారు.
https://youtu.be/JRWA9Pq2mVsm
ఒక వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ చేసిన పనిని పలు ప్రాంతాల్లో దెయ్యాలతో లింక్ చేసి.. వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
https://attracttour.com/2022/

Claim : Video shows a mysterious creature caught on camera in Bihar or Meerut.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story