Mon Dec 23 2024 00:56:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి అంజలి బిర్లా కాదు. 2019లోనే ఆమె సివిల్ సర్వీస్ పరీక్షను క్లియర్ చేసింది.
ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. జూన్ 27, 2024న తన మరోసారి స్పీకర్ గా పదవిని స్వీకరించారు. ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుండి ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన మళ్లీ స్పీకర్ అయిన తర్వాత, ఆయన చిన్న కుమార్తె అంజలి బిర్లాకు సంబంధించిన పోస్ట్‌లు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
Claim :
వైరల్ వీడియోలో ఉన్నది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా. 2019లో IRPS పరీక్షకు హాజరై తన మొదటి ప్రయత్నంలోనే IRPS అయింది.Fact :
వీడియోలో ఉన్నది అంజలి బిర్లా కాదు. అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే 2019లో సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది
ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. జూన్ 27, 2024న తన మరోసారి స్పీకర్ గా పదవిని స్వీకరించారు. ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుండి ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన మళ్లీ స్పీకర్ అయిన తర్వాత, ఆయన చిన్న కుమార్తె అంజలి బిర్లాకు సంబంధించిన పోస్ట్‌లు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా సివిల్ సర్వీస్ పరీక్షలో ఊహించని విధంగా ఉత్తీర్ణత సాధించిందని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. ఆమె సాధారణంగా మోడలింగ్ లో బిజీగా ఉంటుందని.. అయితే ఒక్కసారిగా సివిల్స్ ను క్రాక్ చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అయిన అంజలి బిర్లా అని పేర్కొంటూ ఒక మహిళ మోడ్రన్ దుస్తులలో కారు ముందు నిలబడి ఉన్న వీడియోను X వినియోగదారు షేర్ చేశారు. ఆమె అకస్మాత్తుగా IRPS పరీక్షకు హాజరైనట్లు.. మొదటి ప్రయత్నంలోనే దానిని క్లియర్ చేసిందని కూడా పేర్కొన్నారు.
‘లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మోడలింగ్ కుమార్తె అంజలి బిర్లా అకస్మాత్తుగా IRPS పరీక్షలో వచ్చి 2019 సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే IRPS అయ్యింది.’ అంటూ పోస్టులు పెట్టారు మరికొందరు.
ట్వీట్ ఇప్పుడు తొలగించబడినప్పటికీ, ట్వీట్ ఆర్కైవ్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో ఉన్నది ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా కాదు.
అంజలి బిర్లా రాసిన పరీక్షల గురించి శోధించినప్పుడు, ఆమె 2019లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు మేము కనుగొన్నాము. మేము అంజలీ బిర్లా అసలు చిత్రాన్ని, వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌ను పోల్చినప్పుడు, అందులో ఉన్నది వేరే అమ్మాయి అని ధృవీకరించాం.
జనవరి 2021లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం “లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి మొదటి ప్రయత్నంలోనే UPSCని ఛేదించారు." అని ఉందొ. లైవ్‌మింట్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, అంజలీ బిర్లా చిత్రాన్ని పంచుకున్నారు. ఆమె న్యూ ఢిల్లీలోని రాంజాస్ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్ (ఆనర్స్) అభ్యసించారు. UPSC సిఫార్సు చేసిన 89 మంది అభ్యర్థులలో ఒకరు. ఆమె మొదటి ప్రయత్నంలోనే పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.
2019 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఆగస్టు 4, 2020న ప్రకటించారు. 927 ఖాళీలకు IAS, IFS, IPS.. ఇతర గ్రూప్ 'A', గ్రూప్ 'B' సెంట్రల్ సర్వీస్‌లకు నియామకం కోసం మెరిట్ క్రమంలో 829 మంది అభ్యర్థులను సిఫార్సు చేశారు. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఆధారంగా రూపొందించిన రిజర్వ్ జాబితా నుండి వివిధ సివిల్ సర్వీసెస్ కోసం అంజలితో సహా 89 మంది అభ్యర్థులను కమిషన్ సిఫార్సు చేసింది.
ఎన్డిటివి తన యూట్యూబ్ ఛానెల్లో ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో.. అంజలి బిర్లా సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకాకుండానే క్లియర్ చేశారనే పుకార్లు, సోషల్ మీడియా పోస్ట్‌లు తనను మొదట ప్రభావితం చేశాయని, అయితే ప్రజా సేవలో ఉండడం కోసం ఇవన్నీ తట్టుకుని నిలబడగలిగానని పేర్కొంది. "ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా చట్టం ఉండాలి. ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. ఈరోజు నేను బాధితురాలిని, రేపు మరొకరు బాధితురాలు కావచ్చు" అని ఆమె NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
CSEకి ఆమె ఎంపిక చేయడంపై పుకార్లు రావడంతో ఆమె ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది.
UPSC ప్రచురించిన ప్రెస్ నోట్ ప్రకారం, అంజలి బిర్లా 2019లో సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై దానిని క్లియర్ చేసింది. ఆమె UPSC రిజర్వ్ లిస్ట్‌లో ఉన్నారని మేము కనుగొన్నాము. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రూల్స్ 16 (4) & (5) ప్రకారం మెరిట్ క్రమంలో ఏకీకృత రిజర్వ్ జాబితా. UPSC ఫలితాల స్క్రీన్షాట్లు ఇక్కడ ఉన్నాయి, వీటిని ఉపయోగించి ఆమె పరీక్షకు హాజరయ్యారని. అందులో ఉత్తీర్ణత సాధించగలిగిందని మేము నిరూపించాము.

వైరల్ వీడియోలో ఉన్నది అంజలీ బిర్లా కాదు. ఆమె 2019లో యూపీఎస్సీ పరీక్షకు హాజరై అందులో ఉత్తీర్ణత సాధించింది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ వీడియోలో ఉన్నది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా. 2019లో IRPS పరీక్షకు హాజరై తన మొదటి ప్రయత్నంలోనే IRPS అయింది.
Claimed By : Twitter user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story