Mon Dec 23 2024 16:18:36 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రష్యా దాడిలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం AN-225 ధ్వంసమైంది
ఇరాన్ తన మొహజెర్-10 డ్రోన్లను రష్యా ఆర్మీ 2024 ఫోరమ్‌లో ప్రదర్శించారు. ఇది వార్షిక అంతర్జాతీయ సైనిక-సాంకేతిక కార్యక్రమం. Mohajer-10 మెరుగైన విమాన శ్రేణిలో భాగం, అంతేకాకుండా ఎక్కువ పేలోడ్ ను మోసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగింది.
Claim :
రష్యాకు చెందిన అతిపెద్ద కార్గో విమానం AN-225 విమానం ఇరాన్లో ల్యాండ్ అయిందిFact :
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం AN-225 ను ఉక్రెయిన్ తయారు చేసింది. అయితే కైవ్‌పై రష్యా దాడిలో ఆ విమానం ధ్వంసమైంది.
ఇరాన్ తన మొహజెర్-10 డ్రోన్లను రష్యా ఆర్మీ 2024 ఫోరమ్‌లో ప్రదర్శించారు. ఇది వార్షిక అంతర్జాతీయ సైనిక-సాంకేతిక కార్యక్రమం. Mohajer-10 మెరుగైన విమాన శ్రేణిలో భాగం, అంతేకాకుండా ఎక్కువ పేలోడ్ ను మోసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగింది. రష్యాకు బాలిస్టిక్ క్షిపణులను పంపవద్దని అమెరికా ఇరాన్‌ను ఇటీవలే హెచ్చరించింది. రష్యాకు వందలాది బాలిస్టిక్ క్షిపణులను అందజేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు వార్తలు రావడంపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
రష్యాకు బాలిస్టిక్ మిస్సైళ్ల సరఫరాను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించింది. త్వరలోనే రష్యాకు వందలాది బాలిస్టిక్ మిస్సైళ్లను అందించేందుకు ఇరాన్ ప్రణాళిక రచిస్తోందని, దీనిపై ఐరోపాదేశాలతో అమెరికా టచ్‌లోనే ఉందని వేదాంత్ అన్నారు. మిస్సైళ్లను రష్యాకు పంపే దుస్సాహసానికి ఇరాన్ తెగబడితే అమెరికా నుంచి తీవ్ర స్పందనను చవిచూస్తుందని హెచ్చరించారు.
ఇంతలో.. ఒక విమానానికి సంబంధించిన చిత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యంగా X (ట్విట్టర్)లో వైరల్ అవుతూ ఉంది. ఆ ఫోటోలో రష్యాకు చెందిన AN-225 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. ఇరాన్లో దిగింది. రష్యా- ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాల ఊహాగానాల మధ్య ఈ పోస్ట్‌లు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, ఆంటోనోవ్ AN-225 2022లో ధ్వంసమైంది. మేము AN 225 ఎయిర్‌క్రాఫ్ట్ అనే కీలక పదాలను ఉపయోగించి సెర్చ్ చేశాం. ఆ విమానం ఉనికిలోనే లేదని నిర్ధారించే అనేక వార్తా కథనాలను మేము కనుగొన్నాము. విమానం AN-225 ఉక్రేనియన్ విమానం, రష్యాకు చెందినది కాదు.
ఫిబ్రవరి 2022లో CNN ప్రచురించిన కథనం ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటోనోవ్ AN-225 ధ్వంసమైందని ఉక్రేనియన్ అధికారులు తెలిపారు. ఉక్రేనియన్లో "మ్రియా" లేదా "డ్రీమ్" అని పిలువబడే ఈ విమానం, కైవ్ సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌లో నిలిపి ఉంచగా రష్యా దాడి చేయడంతో ధ్వంసం అయింది. ఈ విమానాన్ని పునర్నిర్మిస్తామని ఉక్రేనియన్ అధికారులు అప్పట్లో తెలిపారు.
బిజినెస్ ఇన్‌సైడర్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, రష్యా ఫిబ్రవరి 2022 ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ధ్వంసం అయింది. డిసెంబరు 1988లో మొదటి విమానంలో ప్రయాణించిన An-225 "మ్రియా", ఉక్రేనియన్ భాషలో "కల" అని అర్ధం. సోవియట్ పాలనలో కైవ్‌కు చెందిన ఆంటోనోవ్ కంపెనీ USSR బురాన్ వ్యోమనౌకను మోసుకెళ్లే ఉద్దేశ్యంతో - బోయింగ్ 747 లాగా ఈ విమానాన్ని నిర్మించారు. రెండవ మ్రియా కూడా ఆర్డర్ చేశారు. అయితే 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత 2009 నాటికి జెట్ 70% పూర్తయింది. అయితే ఇది ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ An-225 ధ్వంసం అయినట్లు CNBC నివేదిక షేర్ చేసింది.
రాయిటర్స్ ప్రకారం.. దేశ మిలిటరీని అడ్డుకున్నందుకు, పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభంలో "మ్రియా" కార్గో విమానాన్ని నాశనం చేయడానికి రష్యా సంకల్పించింది. అందులో భాగంగానే కైవ్‌లో ఉన్న విమానాన్ని రష్యా ధ్వంసం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రణాళికాబద్ధమైన దాడికి ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ యాన్-225 నాశనం అయింది. ఉక్రేనియన్-నిర్మిత "మ్రియా" విమానం దాదాపు 705 టన్నుల బరువు, 290 అడుగుల రెక్కలు కలిగి ఉంటుంది. కైవ్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యన్ దళాలు చేసిన ప్రయత్నంలో ఈ విమానం ధ్వంసమైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం AN-225 విమానం ఇరాన్లో ల్యాండ్ అయిందన్న వాదన తప్పు. ఈ విమానాన్ని ఉక్రెయిన్ తయారు చేసింది.. రష్యా కాదు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిలో ఏకైక AN-225 విమానం కూడా ధ్వంసమైంది.
Claim : రష్యాకు చెందిన అతిపెద్ద కార్గో విమానం AN-225 విమానం ఇరాన్లో ల్యాండ్ అయింది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story