Sat Nov 23 2024 00:32:10 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పల్నాడులో జరిగిన టీడీపీ-జేఎస్పీ-బీజేపీల ప్రజాగళం సభలో వైఎస్సార్సీపీ అజెండా పాటను ప్లే చేయలేదు
ఆంధ్రప్రదేశ్లో 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించాయి.
Claim :
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి (ఎన్డీఏ) నిర్వహించిన ప్రజాగళం సభలో వైఎస్ఆర్సీ అజెండా పాట వినిపించింది.Fact :
టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సభ సందర్భంగా జగనన్న ఎజెండా పాటను ప్లే చేయలేదు, ఆ పాట ఆడియోను సభకు సంబంధించిన వీడియోకు డిజిటల్గా చేర్చారు.
ఆంధ్రప్రదేశ్లో 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించాయి. పల్నాడు జిల్లాలో ప్రజాగళం పేరుతో ఈ పార్టీల నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ నిర్వహించిన మొదటి సమావేశం కూడా ఇదే.
మార్చి 17, 2024న జరిగిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనిని పలు మీడియా సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వైసీపీ కోసం రూపొందించిన పాట సమావేశంలో ప్లే చేశారంటూ.. 38 సెకన్ల వీడియోను పంచుకున్నారు. ప్రజాగళం సమావేశంలో ప్లే చేశారని చెబుతున్నారు. “టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభలో.. జగనన్న అజెండా సాంగ్!” అంటూ పోస్టు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇతర నేతలు హాజరైన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో వైఎస్సార్సీపీ లేదా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ పాటా వినిపించలేదు.
“Prajagalam” సమావేశం కోసం సెర్చ్ చేయగా.. అనేక మీడియా సంస్థలు ఈ సమావేశాన్ని YouTube, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు మేము కనుగొన్నాము. తెలుగు మీడియా సంస్థ ‘టీవీ5’ ప్రచురించిన లైవ్ స్ట్రీమ్ ను చూశాం. అందులో నాయకుల ప్రసంగాలు చూశాం. కానీ ఎక్కడ కూడా జగనన్న ఎజెండా పాట కనుగొనలేదు.
10 TV News Telugu లో వచ్చిన లైవ్ స్ట్రీమింగ్ లింక్ చూడొచ్చు.
మరింత సెర్చ్ చేసినప్పుడు.. అటువంటి సంఘటనల గురించి మాకు ఎటువంటి నివేదికలు కనిపించలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు ప్రచురించిన వీడియోను షేర్ చేసిన oktelugu.com ప్రకారం.. కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉందని, సభ ఆవరణలో టవర్లు ఎక్కుతున్న యువతను కిందికి దిగమని కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ప్రధాని మోదీ అంతరాయం కలిగించారు.
అక్కడ ఏర్పాటు చేసిన టవర్ను దిగిరావాలని కొందరు యువకులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ వైరల్ వీడియోలో చంద్రబాబు నాయుడు ప్రజలకు దిగమని సైగ చేయడం మనం చూడవచ్చు.
ఎన్డీయే కూటమి నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పార్టీ ఎజెండా పాట వినిపించిందన్న వాదన అవాస్తవం. సోషల్ మీడియా వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు ఆడియోను మార్చి, ప్రసంగం మధ్యలో పాటను ఎడిట్ చేసి.. వీడియోను సృష్టించారు.
Claim : AP Chief Minister and YSRC leader Jagan’s party agenda song was played during the Prajagalam meeting conducted by TDP, BJP, and Janasena Alliance (NDA)
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story