Sun Dec 22 2024 21:28:00 GMT+0000 (Coordinated Universal Time)
వినాయకుడికి 'గజాననుడు' అనే పేరు ఎందుకు వచ్చింది..!
శివుడి రాక గురింఛి విన్న పార్వతీ దేవి సంతోశించినదై, భర్త కోసం అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు
కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసింది. అతడిని ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదము చేసి లోపలికి వెళ్లాడు.
పూర్వం గజాననుడు అనే రాక్షనుడు శివుని కోసం ఘోర తవస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహశివుడిని దాచుకుంటాడు. కోన్ని రోజులకు ఈ విషయాన్ని తెలునుకున్న పార్వతీ దేవి శ్రిమహావిష్ణువు నహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో, నందిని తీసుకొని గంగింద్దులను ఆడించేవారిగా వెళ్లి గంగిరెద్దును గజాననుడి ముందు ఆడిస్తారు. దానికి తన్మయత్యం చెందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దాంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా... తన దగ్గరకు వచ్చింది సాక్షాతూ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్న గజాసురుడు నందిశ్వరుడిని తన పొట్ట చీల్చమని.. ఈశ్వరుడు బయటకు బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేల చేయమని విష్ణువును కోరి మరణిస్తాడు.
శివుడి రాక గురింఛి విన్న పార్వతీ దేవి సంతోశించినదై, భర్త కోసం అందంగా సిద్ధమమవుతూ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారుచేసి దానికి ప్రాణం పొసి ద్వారం వద్ద నిలబబెట్టి ఎవరినీ రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళుతుంది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన పరమ శివుడ్ని ఆ బాలుడు లోనికి వెళ్ళకుండా అడ్డుకుంటాడు. దీంతో ఆయన కోపంతో బిడ్డ శిరన్సును ఖండించి లోపలికి వెళతాడు. అప్పటికే స్నానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీ దేవి భర్తను చూసి సంతోషించి బయట ఉన్న బాలుడు తమ బిడ్డ అని పార్వతీ దేవి చెబుతుంది. శిపుడు బాధతో తాను చేసిన తప్పును గుర్తు తెచ్చుకుని. గజాసురిడి తలను ఆ పిల్లవాడికి అతికించి బ్రతికిస్తాడు. గజ ముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు.
Next Story