రోజా కాళ్ళు పట్టుకుంటా .. కానీ - బండ్ల కండిషన్
వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తుంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలో వైయస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొందరు మహిళా నాయకులు బండ్ల గణేష్ పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేయాలని, రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనికి ప్రతిస్పందనగా బండ్ల గణేష్ మాట్లాడుతూ సంఘటన జరిగిన నాడు గౌరవ శాసనసభ్యులు రోజానే అసభ్య పదజాలంతో మొదట దూషించారని బండ్ల గణేష్ ఆరోపించారు... ఈ క్రమంలో రోజాకు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని అన్నారు. తాను అభిమానించే, ఆరాధించే, దైవంగా భావించే పవన్ కళ్యాణ్ ను దూషిస్తే ఇలాగే ఉంటుందని బండ్ల గణేష్ అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు కనుక రోజా క్షమాపణలు చెబితే.. ఆమె కాళ్లు పట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ విషయం ఇంతకంటే ఎక్కువ సాగదీయకూడదు అని బండ్ల గణేష్ తన ఫోన్ ని సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని అంటున్నారు.