Thu Dec 26 2024 08:20:21 GMT+0000 (Coordinated Universal Time)
తన విడాకులపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
హిమజా రెడ్డి పెళ్లి, విడాకులపై గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇది
ప్రముఖ నటి, బిగ్ బాస్ 3 ఫేమ్ హిమజా రెడ్డి పెళ్లి, విడాకులపై గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఆమె స్నేహితులు, అభిమానులు ఏంటి ఇదంతా నిజమేనా అంటూ.. హిమజ కు పోస్టులను షేర్ చేసి అడగ్గా.. షాకవ్వడం హిమత వంతైంది. ఆమె కుటుంబ సభ్యులు ఈ రూమర్లను చూసి బాధపడ్డారట కూడా. ఈ ఫేక్ వార్తలపై హిమజ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
నా పెళ్లి, విడాకులు.. ఇలా ఏదేదో రాసేస్తున్నారు. ప్లీజ్ దయచేసి నాపెళ్లికి అలాగే నా విడాకులకి నన్ను కూడా పిలవండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది హిమజ. "ఈ మధ్య నా వీడియోలు బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇటీవల ఇల్లు కట్టిస్తున్న వీడియో కూడా షేర్ చేశాను. దాంతో ఎవరికో బాగా జలసీ కలిగి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. నా గురించి న్యూస్ రాసిన యూట్యూబ్ ఛానల్ వాళ్లని కామెంట్స్ రూపంలో తిట్టారు. వాళ్లందరికీ థ్యాంక్స్" అని పేర్కొంది హిమజ. జీవితంలో పైకొచ్చేవాళ్లని చూసి ఏడవకుండా.. మీరెలా పైకి రావాలో ఆలోచించండి అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
Next Story