అందుకేనా బాగా యాక్టివ్ అయ్యింది..!
ఒకప్పుడు హీరోయిన్ గా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సరసన నటించిన భూమిక.. అవకాశాలు తగ్గగానే యోగా గురువు భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకుని సెటిలైంది. [more]
ఒకప్పుడు హీరోయిన్ గా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సరసన నటించిన భూమిక.. అవకాశాలు తగ్గగానే యోగా గురువు భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకుని సెటిలైంది. [more]
ఒకప్పుడు హీరోయిన్ గా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సరసన నటించిన భూమిక.. అవకాశాలు తగ్గగానే యోగా గురువు భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇక భూమిక పెళ్లి తర్వాత భర్త భరత్ ఠాగూర్ తో కలిసి సినిమాల నిర్మాణం కూడా చేపట్టింది. కానీ భూమిక హీరోయిన్ గా సక్సెస్ అయినంతగా… నిర్మాతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక నటనకు, సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన భూమిక మళ్లీ బాలీవుడ్ మూవీ మహేంద్ర సింగ్ ధోని సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు.. టాలీవుడ్లో హీరోలకు అక్కగా, వదినగా మంచి పర్ఫార్మెన్స్ తో బిజీ అయ్యింది.
ఆర్థిక సమస్యలు ఉన్నాయా..?
ఇప్పటికే ఎంసీఏలో నానికి వదినగా, సవ్యసాచిలో చైతుకి అక్కగా నటించిన భూమిక.. యూటర్న్ లోనూ సినిమాని మలుపుతిప్పే కీలకపాత్రలో నటించింది. ఇక తాజాగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలోకి ఎంటరైంది. అయితే అక్క, వదిన పాత్రలతో పాటుగా.. భూమిక మరేదో ఆశిస్తున్నట్టుగా ఉంది ఆ ఫోటో షూట్స్ వ్యవహారం చూస్తుంటే. అయితే భూమిక అంతలా అవకాశాల కోసం ఎదురు చూడడానికి ఆమె ఆర్ధిక పరిస్థితులే కారణమంటున్నారు. భూమిక భర్తతో కలిసి నిర్మించిన సినిమాలతో పాటుగా… భరత్ కి వ్యాపారాల్లో నష్టాలు రావడంతోనే.. అర్థిక సమస్యలు తలెత్తాయని.. అందుకే భూమిక నటన మీద పూర్తి కాన్సంట్రేట్ చేస్తుందని అంటున్నారు.
హీరోయిన్ అవకాశం కోసమే..!
నటనతో బిజీ అయ్యి.. మళ్లీ భర్త భారత్ ని మునుపటిలా చూడాలని భూమిక ఆశపడుతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే మంచి గ్లామర్ తో మళ్లీ రీఎంట్రీలో చెలరేగిపోయి నటనతో ఆకట్టుకుని.. కనీసం సీనియర్ హీరోస్ పక్కన అయినా హీరోయిన్ గా చెయ్యాలనే ఆశతోనే అలా గ్లామర్ ఫోటో షూట్స్ కి తెరలేపిందనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్.