Mon Dec 23 2024 11:28:43 GMT+0000 (Coordinated Universal Time)
ఐటమ్ సాంగ్ లో సమంత
నాగచైతన్యతో డైవర్స్ తర్వాత సమంత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమాల్లో ఐటెం సాంగ్ నటించేందుకు రెడీ అయిపోయింది.
అక్కినేని హీరో నాగచైతన్యతో డైవర్స్ తర్వాత సమంత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమాల్లో ఐటెం సాంగ్ నటించేందుకు కూడా రెడీ అయిపోయినట్లు తెలిసింది. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటించేందుకు ఓకే తెలిపినట్ల ఫిలింనగర్ వర్గాలు చెబుతన్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తొలిసారి సమంత స్క్రీన్ పై కనిపించే సినిమా కూడా ఇదే అవుతుందని చెబుతున్నారు.
మళ్లీ గ్లామరస్ గా....
నిజానికి సమంత అనేక వెబ్ సిరీస్ చేసింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల్లో తక్కువ నటించింది. అయితే విడాకుల తర్వాత తిరిగి జోరు పెంచాలని చూస్తుంది. అందుకే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో సమంత మళ్లీ గ్లామరస్ గా కన్పించేందుకు రెడీ అవుతుందన్న టాక్ విన్పిస్తుంది. ఐటెం సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేక సెట్ వేశారని చెబుతున్నారు.
Next Story