అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కి పొసగడం లేదా..?
గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ [more]
గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ [more]
గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రకటన ఇప్పించాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే అస్సలు క్లారిటీ లేదు. ఎందుకంటే నిన్నమొన్నటివరకు ఫిబ్రవరి 14న త్రివిక్రమ్ – బన్నీ సినిమా మొదలవుతుంది అని అన్నారు. కానీ తాజాగా మార్చ్ లో మొదలవుతుందని న్యూస్ వినబడుతుంది. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ తో సయోధ్య కుదరకపోవడంతోనే ఈ సినిమా మొదలవ్వడం ఆలస్యమవుతుందని అంటున్నారు.
కథ రొటీన్ అనుకోవడంతో…
మొదట్లో అల్లు అర్జున్ సినిమాకి బాలీవుడ్ హిట్ సినిమాని త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్నాడనే న్యూస్ వచ్చింది. కానీ తర్వాత త్రివిక్రమ్ కొత్తగా రెండు స్టోరీ లైన్స్ చెప్పాడని.. ఒక లైన్ నచ్చిన బన్నీ సినిమా మొదలెడదామని చెప్పాడంట. త్రివిక్రమ్ కథను డెవెలప్ చేసే పనిలో బిజీ అవడం.. ఈలోపు త్రివిక్రమ్ చెప్పిన కథలను బన్నీ రొటీన్ అని ఫీల్ అవడంతో.. కథ విషయం మళ్లీ మొదటికి వచ్చిందని.. అలాగే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కి సయోధ్య కుదరడం లేదనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది. త్రివిక్రమ్ చెప్పే హీరోయిన్స్ పేర్లు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు అల్లు అర్జున్ కి నచ్చడం లేదని.. అల్లు అర్జున్ చెప్పే పేర్లు త్రివిక్రమ్ కి నచ్చడకపోవడంతోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు లెట్ అయ్యాయని అంటున్నారు. అందుకే సినిమా ఫిబ్రవరిలో మొదలవ్వాల్సింది కాస్తా… మార్చ్ లో మొదలుపెట్టే ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.